తెలంగాణ బీజేపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట. జిల్లా అధ్యక్షుల నియామకం పార్టీలో అగ్గి రాజేసిందని చెప్పుకుంటున్నారు. కాషాయ పార్టీకి తెలంగాణలో సంస్థాగతంగా 38 జిల్లాలు ఉన్నాయి. ఇందులో 27 జిల్లాల అధ్యక్షుల నియామకానికి కేంద్ర పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ రిటర్నింగ్ అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి నామినేషన్స్ తీసుకొచ్చారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీ భవన్ లో కుల గణన పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ఫలాలు జనాభా దామాషా ప్రకారం పంచాలని రాహుల్ గాంధీ ఆలోచన అని అన్నారు. ప్రణాళిక బద్దంగా సమగ్ర కుల సర్వే సంపూర్ణంగా జరిగింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. ప్రభుత్వం అంటే పన్నులు వసూలు చేసి.. పాలించడం కాదు. దేశంలో వచ్చిన విప్లవాత్మకమైన…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఆయా పార్టీల కుట్రలను తిప్పికొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాడని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తెలంగాణలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే యువజన కాంగ్రెస్ నేతలు కీలకం అని…
తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మె్ల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం నిన్నటితో ముగిసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరుగనన్నది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజీపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్…
ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం బీఆర్ఎస్ నాయకులు,శ్రేణులపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. ‘అధికారం లేకపోవడంతో… బిఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. పదవి, అధికారం లేకుండా ప్రజలకు సేవ చేసే అలవాటు బిఆర్ఎస్ శ్రేణులకు లేదు అని మండిపడ్డారు. పత్రికా సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. Also Read: Zee…
మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం ఏం చేసిందంటూ అందరూ మాట్లాడుతున్నారని.. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వస్తే ఈ పదేళ్లలో మోడీ ప్రభుత్వం ఎం చేసిందో చూపిస్తామన్నారు. గ్రామ పంచాయితీలకు రాష్టం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ప్రధాని మోడీ…
పార్టీ మారిన వారి పరిస్థితి చూస్తున్నాం అని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి ఉండదు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ చాలా హుషారుగా ఉందని, ఎవరు వార్త రాపించారో వాళ్లనే అడగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా సర్వే చేసిందని, హైదరాబాద్ గ్రామాల్లో సర్వే ప్రాపర్‌గా జరుగలేదన్నారు. 60 లక్షల మంది ఎక్కడ పోయారో లెక్కలు లేవని తలసాని విమర్శించారు. ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవండని, తమ మీద…