ప్రధాని మోడీ – పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికర చర్చ.. ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..? ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు హాజరయ్యారు.. ఇక, ఇదే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.. అయితే, ఆ వేదికపై డిప్యూటీ…
తెలంగాణలో కొత్త రాజకీయ రగడ మొదలైంది. కాకుంటే... ఇది మత పరంగా సున్నితమైన అంశం కావడంతో... జాగ్రత్తగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ అనుసరిస్తోందన్న చర్చ సైతం మొదలైంది. త్వరలో రంజాన్ మాసం మొదలవబోతోంది. ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. ఆఫీస్ సాధారణ సమయం కంటే ఒక గంట ముందే... అంటే సాయంత్రం నాలుగు గంటలకే ముస్లిం ఉద్యోగులంతా విధులు ముగించుకుని వెళ్ళిపోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా జాతీయ విపత్తు నిర్వహణ నిధి (NDRF) నిధులను ఇవ్వనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా బుధవారం ఈ నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల కానున్నాయి. ఇందులో తెలంగాణ వాటా కింద రూ.231.75 కోట్లు అందనున్నాయి. గతేడాది ఆయా రాష్ట్రాలకు విడుదల చేసిన ఎన్బీఆర్ఎఫ్ నిధులకు..
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు సందడి చేయనున్నాయి. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ జరుగబోతోంది. తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్లో జరగనున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కి 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ పోటీలకు సంబంధించిన అధికారిక ప్రకటనను మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్,…
చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ను వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. రంగరాజన్కు ఫోన్ చేసిన వైఎస్ జగన్.. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమైన విషయం అన్నారు వైఎస్ జగన్..
తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోగానే పార్టీ శ్రేణులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. కేడర్ తోపులాటతో అసహనానికి గురైన కేసీఆర్ ఒర్లకండిరా బాబు.. దండం పెడతానంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరుగనున్నది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. Also Read:PVR INOX: సినిమా ముందు యాడ్స్…
Electric Shock: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తుండగా 13 మంది విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో లింగ ప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందాడు. అలాగే ఈ ఘటనలో మరో యువకుడు వడ్డే కర్ణాకర్ (25) పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కర్ణాకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం…
Union Government: గత ఏడాది సంభవించిన విపత్తులు, వరదలకు సంబంధించిన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు (ఫిబ్రవరి 19) ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది.