BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42 శాతం రిజ్వరేషన్లు కల్పించేలా బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఈ సందర్భంగా బీసీ అండ్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీ బిల్లు దేశానికే రోల్ మోడల్ అవుతుందన్నారు. ఇక, బీసీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా మాట్లాడిన ఆయన.. స్థానిక సంస్థలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు కల్పించడం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.. ఈ నిర్ణయం దేశానికే ఒక ఆదర్శం అన్నారు. ఇక, బ్యాక్ వర్డ్ క్లాస్ అంటే సమాజానికి బ్యాక్ బోన్ అని పేర్కొన్నారు. బీసీ బిల్లును పక్కాగా రూపొందించాం.. బీసీ బిల్లుపై 15 మంది మాట్లాడారు.. అసెంబ్లీలో బీసీ బిల్లుపై సమగ్రంగా చర్చ జరిగింది.. బీసీ బిల్లుకు మతమపరమైన రంగు పూయొద్దని కోరారు. బీసీ బిల్లుకు న్యాయపరమైన చిక్కులు రాకపోవచ్చని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
Read Also: Chandrababu and Pawan Kalyan: కేబినెట్ ముగిసిన తర్వాత సీఎం-డిప్యూటీ సీఎం ప్రత్యేక భేటీ
కాగా, తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా రేపు ఉదయం అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలను బీసీ ఎమ్మెల్యేలు కలవనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలిపిన సందర్భంగా సీఎంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పనున్నారు బీసీ ఎమ్మెల్యేలు.