AP Deputy CM Pawan: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు రేపు ( జనవరి 3న) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. కొండగట్టులో 96 గదుల సత్రాల నిర్మాణ స్థలానికి పవన్ శంఖుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ స్థలాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో భద్రతా, సౌకర్యాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read Also: BRS Boycott Assembly: రేపు అసెంబ్లీని బహిష్కరించిన బీఆర్ఎస్.. సీఎంపై హరీష్ రావు ఫైర్
ఇక, జేఎన్‌టీయూ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడు స్థలాన్ని అధికారులు పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు 1100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు. అలాగే, బృందావన్ రిసార్ట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.