CM Revanth Reddy: ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన.. ఫామ్ హౌస్ల డ్రైనేజీ నీళ్లను గండిపేటలో కలిపారు..
- ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన..
- గండిపేటలో ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు..
- ఫామ్ హౌస్ల డ్రైనేజీ నీళ్లను గండిపేట చెరువులో కలిపారు: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ అనంతగిరిలో ప్రారంభం అయి.. వాడపల్లి వరకు 240 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.. ఈసా, మూసా నదులు బాపూఘాట్ దగ్గర కలుస్తాయి.. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టాం.. మూసీ ప్రక్షాళనపై నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేశామన్నారు. ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read
ఇక, గండిపేటలో ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. అలాగే, ఫామ్ హౌస్ ల డ్రైనేజీ నీళ్లను గండిపేట చెరువులో కలిపారని ఆరోపించారు. గండిపేట, మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లు కట్టుకున్నవాళ్లు.. లక్షలు, కోట్లు ఖర్చు చేసి నాపై సోషల్ మీడియాలో బద్నాం చేయించారు.. అయినా మేం భయపడలేదని వెల్లడించారు. ఇక, గుజరాత్ లో సబర్మతి ప్రాజెక్టు చేపట్టి 60 వేల కుటుంబాలను తరలించారు.. యూపీలో గంగా ప్రక్షాళన చేశారు.. ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు.. నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే, మూసీ పొల్యూషన్ వల్ల శిక్ష అనుభవిస్తుంది నల్గొండ ప్రజలు అని సీఎం రేవంత్ అన్నారు. మూసీ మురికి అంతా నల్గొండ ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నల్గొండ వాళ్ళ మీద దేవుడే శిక్ష విధించాడు.. వాళ్ళ దురదృష్టం, వల్లకు దేవుడు శిక్ష విధించినట్టు ఉంది.. గండిపేట నుంచి వికారాబాద్ వరకు ప్రక్షాళన కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.. గోదావరి జలాలు రెండు ఏళ్లలో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మూడు నెలల్లో 21 కిలోమీటర్ల ప్రక్షాళన అంచనాలు ఫైనల్ చేస్తామని పేర్కొన్నారు. ఏడీబీ బ్యాంక్.. రూ. 4100 కోట్లు రుణం ఇస్తుంది.. కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.. వచ్చే నాలుగైదు రోజుల్లో అన్ని వివరాలు బయటకు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!