BRS Boycott Assembly: రేపటి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపటి సభకు హాజరు కావొద్దని పేర్కొన్నారు. రేపు ఉదయం తెలంగాణ భవన్ లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
Read Also: Iran: ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు.. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి
ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గన్ పార్క్ దగ్గర నిరసన తెలియజేశారు. ఇక, మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య రీతిలో దిగి వస్తూ శాసనసభ నిబంధనలు లేకుండా సభను నడుపుతున్నారని ఆరోపించారు. బీఏసీలో మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు వేరు అసెంబ్లీలో పెట్టినవి వేరు.. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు పెట్టకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూసీకి సంబంధించి కొన్ని ప్రశ్నలను సభలో సందించాం.. వాటిపై సమాధానాలు ఇవ్వకుండా సీఎం మాట్లాడుతున్నారు.. అసెంబ్లీని సీఎం బూతులమయం చేశాడని ఎద్దేవా చేశారు. ఇలా మాట్లాడిన స్పీకర్ ఆయనకి అడ్డు చెప్పలేదు.. బీఆర్ఎస్ కి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఇక సభకు ఎందుకు రావాలని హరీష్ రావు ప్రశ్నించారు.
అయితే, రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రధానమంత్రి మీద మాట్లాడటం లేదా అని హరీష్ రావు అడిగారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత మాకు ఉంది.. మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు సభలో ఎక్కువైంది.. ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాల్సి ఉంది.. గాంధీభవన్ లో మాట్లాడే సొల్లు అసెంబ్లీలో మాట్లాడతారా అని ప్రశ్నించారు. దీని కోసమైనా అసెంబ్లీ పెట్టడం.. మల్లన్న సాగర్ నుంచే కాళేశ్వరం ప్రాజెక్టులోకి నీరు తెస్తున్నారా అని అడిగాం.. మూసీ ప్రక్షాళనకు నడుము బిగించిందే బీఆర్ఎస్.. బాడీ షేమింగ్ కు ముఖ్యమంత్రి పాల్పడుతున్నారు.. రౌడీషీటర్స్ ఇంకా మంచిగా మాట్లాడుతారని హరీష్ రావు అన్నారు.
Read Also: Dhurandhar: ఒకే రోజులో ఐదు రికార్డ్‌లు బ్రేక్ చేసిన ‘ధురంధర్’..
ఇక, కేసీఆర్ పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. మైక్ ఇవ్వకుండా శాసనసభలో కూర్చోవడం వెస్ట్.. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుంది.. సభలో అందరికీ సమాన హక్కులు ఉండాలి.. సీఎం అడ్డగోలుగా మాట్లాడితే స్పీకర్ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.