IPS Officers Transfers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీ అంజనీకుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్‌లను రిలీవ్ చేస్తూ, తక్షణమే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వెలువరించింది. ఇక కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి రిలీవ్‌పై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడం గమనార్హం. త్వరలో రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలకు ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తానికి స్వల్ప మార్పులు, కీలక పోస్టింగ్‌లతో…
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరగబోతున్న ఎన్నికల్ని చాలా సీరియస్‌గా తీసుకుని వర్కౌట్ చేస్తోంది బీజేపీ. రెండు ఉపాధ్యాయ,ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా...షెడ్యూల్ రాక ముందే తమ అభ్యర్థులను ప్రకటించి అప్పట్నుంచి దూకుడుగానే ఉంది. అంగబలం, అర్థ బలం ఉన్న వారినే అభ్యర్థులుగా ప్రకటించి.. సాధారణ ఎన్నికల స్థాయిలో మేటర్ని సీరియస్‌గా తీసుకున్నారు కాషాయ నేతలు. ఈ ఎన్నికల ఓటర్లంతా చదువుకున్నవారు కావడం, ఆయా వర్గాల్లో తమ పార్టీకి పట్టుందన్న నమ్మకంతో... ఎట్టి పరిస్థితుల్లో సత్తా…
పదేళ్ళు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్... తిరిగి పుంజుకుని జనాల్లో ఉండడానికి సరికొత్త ప్లానింగ్‌లో ఉందట. ఏది ఏమైనా సరే... ప్రభుత్వం మీద పోరాటం విషయంలో వెనక్కి తగ్గకూడదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. అందుకు తగ్గట్టే ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
గ్రూప్-2 మెయిన్స్‌పై గందరగోళం..! స్పందించని ఏపీపీఎస్సీ.. సీఎం అసంతృప్తి..! ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. గ్రూప్ 2 మెయిన్స్ పై వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై APPSCకి లేఖ రాసింది.. రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను అర్థం చేసుకుంది ప్రభుత్వం.. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన విషయం విదితమే కాగా.. ఆ ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని.. ఇక, జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి ఫోన్లో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు తెలంగాణ సీఎం..
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి చెందాడు. నీలోఫర్ ఆసపత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల ఆర్నవ్ తుది శ్వాస విడిచాడు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు లిఫ్ట్ లో చిక్కుకున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డాడని.. ఈ కారణంగానే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్లు వెల్లడించారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న…
Ponnam Prabhakar : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వచ్చే మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, చట్టాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను…
KTR : తెలంగాణలో సాగునీటి సంక్షోభం మరింత తీవ్రరూపం దాలుస్తుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల గత ఏడాది కాలంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎండిపోయాయని, సాగునీటి крైసిస్ అన్నదాతలను ఆత్మహత్యలకు దారి తీస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకునేందుకు సరిపోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లను తగిన విధంగా…