తెలంగాణ రాష్ట్ర ప్రజలు సబీక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఆయన శ్రీమతి మల్లు నందినితో కలిసి స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మిపురంలోని పురాతన శివాలయంలో, మధిర నియోజకవర్గ కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ…
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం ఈరోజు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమండో ఫోర్స్ (మార్కోస్) చేరుకోనుంది. నేల, నీరు, ఆకాశం.. ఎక్కడైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సహాయక చర్యలకు దిగే సత్తా ఈ మార్కోస్కు ఉంటుంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇంజనీర్లతో కలిసి రెస్క్యూలో మార్కోస్ టీమ్ పాల్గొననుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్సింగ్ తన బృంద సభ్యులతో టన్నెల్ వద్దకు రానున్నారు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం 10.30కు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం భేటీ కానున్నారు. బీసీ కులగణన రిజర్వేషన్లు, రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. అలానే ఎస్ఎల్బీసీ ప్రమాదంను పూర్తిస్థాయిలో ప్రధానికి వివరించనున్నారు. ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మోడీతో సీఎం రేవంత్ ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో.. మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.…
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోతోంది. భక్తులు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించి.. దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్లను కలిశారు. జనగణన కుల ప్రాతిపదికన జరగాలని కోరారు. అలాగే డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రధాని మోడీతో సత్సంబంధాలు ఉన్నాయి.. కచ్చితంగా కుల ప్రాతిపదికన జనగణనపైన మోడీతో చర్చించాలని హనుమంతరావు కోరారు. తెలంగాణ సీఎంరేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణలో జనగణన ప్రారంభించారని గుర్తు చేశారు.
తెలంగాణ అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము మూడు స్థానాల్లో గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ ప్రజలు వినాలని, అయన పనితీరు ఆధారంగానే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం మాపై విమర్శలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడినట్టు.. ఇప్పుడు మాట్లాడితే ఓట్లు పడతాయని సీఎం అనుకుంటున్నాడని విమర్శించారు. కులగణనకు…
Maha Shivratri 2025: మహా శివరాత్రి భారతదేశంలోని ముఖ్యమైన హిందూ పండుగల్లో ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మహా శివరాత్రిని ప్రత్యేక ఉత్సవాలతో, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి. వాటిని ఎలా చెరలో ఒకసారి చూద్దాం. తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాలు: వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా…