కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 9 పేజీల బహిరంగ లేఖ రాశారు. కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తులను సీఎం లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కీలక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతుల కోసం రాష్ట్రం ఎదురుచూస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…
ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అని హరీశ్ రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేక పోయారన్నారు. హరీశ్ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడని ఎద్దేవా చేశారు. అడిగిన దానికి తప్ప.. అన్నిటికి హరీశ్ రావు స్పందిస్తారని విమర్శించారు. ప్రమాదం జరగగానే హరీష్ రావు ఎందుకు రాలేదు?…
తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ప్రదర్శించండని సూచించారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామ కృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపీలతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా పథకంలో భాగంగా మూడు ఎకరాల వరకు…
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ కార్మికులు సొంతూర్లకి పయనమవుతున్నారు. ఇటీవలి రోజుల్లో టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకోవడంతో తమ కుటుంబ సభ్యులు భయపడుతున్నారని అధికారులకు కార్మికులు చెబుతున్నారు. టన్నెల్లో పని చేయాలంటే భయంగా ఉందని, పనులు ముందుకు సాగుతాయో లేదో అని కార్మికులు అంటున్నారు. జార్ఖండ్, బీహార్, యూపీ, హర్యానాలకు కొందరు ఎస్ఎల్బీసీ కార్మికులు బయల్దేరారు. ఇటీవల జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దాదాపుగా…
కుల గణన సర్వే నేటితో ముగియనుందని.. ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమారెటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కుల గణన సర్వేలో పాల్గొనాలని కోరారు. ఎక్కడెక్కడ ఇంకా కుల సర్వేలో పాల్గొనలేదో.. అక్కడ కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలని మంత్రి…
Telangana : తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం, సాధికారత కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన “తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం”గా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధికి తన నిబద్ధతను మళ్ళీ ఉద్ఘాటించిందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి…
KRMB : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా నదీ నిర్వహణ మండలి (KRMB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి పంపిణీ, వృధా కాకుండా సరైన వినియోగం, తాగునీటి ప్రాధాన్యత వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాగునీటికి ప్రాధాన్యం – రెండురాష్ట్రాలకు బోర్డు సూచన KRMB రెండు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలను అత్యంత ప్రాధాన్యతతో చూడాలని సూచించింది. ప్రజలకు తాగునీరు అందించడమే మొదటి బాధ్యతగా…