రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దాంతో పదేళ్ల తర్వాత పేదల కల నెరవేరబోతోంది. ఒకే రోజు లక్ష రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని…
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈసీ ఆదేశాల ప్రకారం.. పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలి. ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండడంతో.. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న ఉదయం 8 నుంచి పోలింగ్ ఆరంభం కానుంది. పోలింగ్కు మరో రోజే గడువు…
వేములవాడ రాజన్న సన్నిధిలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి మూడు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. రేపు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. శివరాత్రికి 1500 పోలీసులతో ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మహా శివరాత్రి జాతర కోసం వివిధ డిపోల నుండి 778 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు…
Anji Reddy Chinnamail: ఉమ్మడి కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ నియోజక వర్గాల ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. మార్చి 3న నోటిఫికేషన్.. మర్చి 20న పోలింగ్, కౌంటింగ్ జరగనున్నాయి. తెలంగాణలో 5 , ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29తో ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీలు: 1.మహమ్మద్ మహమూద్ అలీ 2.సత్యవతి రాథోడ్ 3.శేరి…
తెలంగాణలోని మందు బాబులకు బ్యాడ్ న్యూస్. 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి 27వ తారీకు సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోని సగానికి పైగా…