Uttam Kumar Reddy: గ్యాస్‌పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..
- గ్యాస్ కొరతపై మంత్రి స్పష్టత
- గృహ వినియోగదారులకు సరిపడా సిలిండర్లు
- కమర్షియల్ గ్యాస్ కొరతకు కేంద్ర గైడ్‌లైన్స్ కారణం
- అక్రమ నిల్వలపై ప్రత్యేక కమిటీల ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, కేవలం కమర్షియల్ సిలిండర్ల విషయంలోనే కొంత కొరత ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ , ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల మంది యాక్టివ్ గృహ వినియోగదారులు ఉన్నారని, వారికి సరిపడా సిలిండర్లను ఆయిల్ కంపెనీలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. గతంలో రోజుకు సగటున 2.15 లక్షల సిలిండర్లు సరఫరా అయ్యేవని, ప్రస్తుత డిమాండ్‌ను బట్టి దానిని 2.3 లక్షలకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. గ్యాస్ కొరత ఉందన్న ఆందోళనతో వినియోగదారులు అనవసరంగా ఓవర్ బుకింగ్ చేసి సిస్టమ్‌ను ఓవర్‌లోడ్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
Cockroach: బాబోయ్ ఇవి బొద్దింకలు కావు.. కొత్త తరం గూఢాచారులు!
హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు వాడే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రం తగ్గుదల ఉన్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త మార్గదర్శకాల వల్ల గతంలో ఉన్న సరఫరాలో కేవలం 20 శాతం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందని ఆయన వివరించారు. గతంలో రోజుకు 23,000 కమర్షియల్ సిలిండర్లు సరఫరా అయ్యే చోట, ఇప్పుడు కేవలం 6,200 మాత్రమే వస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు.
Father Property: తండ్రి ఆస్తులు అన్నీ కొడుకువి కావు.. సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు..
రాష్ట్రంలో గ్యాస్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్ర , జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గృహ అవసరాల సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మొత్తానికి, సామాన్యుడి వంటింట్లో మంట ఆరిపోకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!