కొన్ని రోజుల క్రితం ముగ్గురు పిల్లలను కన్న తల్లే కర్కశంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అమీన్ పూర్ లో రజిత, చెన్నయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరి సంసారంలో గెట్ టు గెదర్ పార్టీ చిచ్చుపెట్టింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లిన రజిత టెన్త్ క్లాస్ లో తనతోపాటు చదువుకున్న శివతో పాత పరిచయానికి బీజం పడింది. ఇంకేముంది.. భర్త అంటే ఇష్టం లేని రజిత శివతో చనువు పెంచుకుంది. కొంత కాలం నుంచి అక్రమ సంబంధం కొనసాగుతోంది.
Also Read:USA: ట్రంప్ భయం.. సూపర్ మార్కెట్లకు అమెరికన్ల పరుగు.. వేటిని ఎక్కువగా కొంటున్నారంటే..?
తన జీవితాన్ని శివతోనే గడపాలని నిర్ణయించుకున్న రజిత తనను పెళ్లి చేసుకోవాలని శివను కోరింది. అయితే పిల్లలను చంపేసి వస్తే పెళ్లి చేసుకుంటానని శివ రజితకు సలహా ఇచ్చాడు. తాను కోరుకున్న జీవితం దక్కాలంటే పిల్లలను భర్తను అడ్డుతొలగించుకోవాని నిర్ణయించుకుంది. ఓ రోజు రాత్రి పిల్లలకు ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తనకు కడుపునొప్పి వస్తుందని నాటకం ఆడింది. వెంటనే భర్త చెన్నయ్య ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. పిల్లలు ఎలా చనిపోయారో తెలియక చెన్నయ్య కన్నీరుమున్నీరుగా విలపించాడు. అయితే మొదట చెన్నయ్య మీదనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు రంగంలోకి దిగి తమదైన స్టై్ల్లో విచారణ చేపట్టగా రజిత అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది.
Also Read:Ponguleti Sudharkar Reddy : తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి
ప్రియుడు శివతో కలిసి జీవించేందుకు తానే పిల్లలను చంపినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. దీంతో పోలీసులు రజితను, ప్రియుడు శివను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే భర్త చెన్నయ్య తన పిల్లల మృతిని జీర్ణించుకోలేకపోతున్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాడు. నన్ను చంపి నా పిల్లల్ని వదిలిపెట్టినా బాగుండేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చెన్నయ్య మాట్లాడుతూ.. నాకు నా భార్యకు 20 ఏళ్ల తేడా ఉంది.. నా భార్య నన్ను కొన్ని నెలలుగా మునుగ చెట్టు ఎక్కించి భజన చేసింది.. నన్ను రెండో పెళ్లి చేసుకోవడానికి నా ఆస్తి ఆమె పేరు మీద రాస్తేనే చేసుకుంది..
Also Read:Shocking Video: వృద్ధాశ్రమానికి వెళ్లనందుకు.. అత్తపై దారుణంగా దాడి చేసిన కోడలు..
శివకుమార్ ని కలిసిన తర్వాత నుంచి నా భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది.. పిల్లలకు విషం పెట్టి చంపి తాను ఆత్మహత్యయత్నం నాటకం ఆడింది.. పిల్లలు చనిపోయారని చెప్తే.. నా భార్య కంటి నుంచి చుక్క నీరు కూడా రాలేదు.. నా భార్య నన్ను క్షమించమని కోరితే మన్నించే ప్రసక్తే లేదు.. నా భార్యకు చావే శరణ్యం చంపేయండి లేదంటే మరణశిక్ష విధించండి.. నా భార్యను ఎన్‌కౌంటర్ చేయండి.. అదే సరైన న్యాయం అంటూ చెన్నయ్య పోలీసులను కోరాడు.