TTD : తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ సిఫార్సు లేఖల కోసం ప్రత్యేక పోర్టల్
- టీటీడీ దర్శనానికి ప్రత్యేక పోర్టల్ అందుబాటులో
- ప్రజాప్రతినిధులు ఇకపై పోర్టల్ ద్వారానే సిఫార్సు లేఖలు
- పార్టల్‌లో లేని లేఖలను టీటీడీ అంగీకరించదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇచ్చే సిఫార్సు లేఖల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ద్వారా లేఖలు పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రజాప్రతినిధులు భక్తులకు ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనం మరియు రూ. 300 ప్రత్యేక దర్శన టిక్కెట్లకు సంబంధించిన లేఖలన్నీ ఈ పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.
భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ప్రజాప్రతినిధులు ఈ పోర్టల్ ద్వారానే సిఫార్సు లేఖలను తయారు చేసి, వాటిని సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం భక్తులకు అసలు లేఖను అందజేయవచ్చు. ఈ విధానం ద్వారా ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలకు ఒక ప్రత్యేకమైన సమర్థమైన విధానం నెలకొంటుందని అధికారులు పేర్కొన్నారు.
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ఈ పోర్టల్‌లో నమోదైన లేఖల వివరాల ప్రకారమే టీటీడీ భక్తులకు దర్శన అనుమతులను మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు. పోర్టల్‌లో లేనికాని లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరించదని తెలియజేశారు. ప్రజాప్రతినిధులకు ఈ పోర్టల్‌ను ఎలా ఉపయోగించాలో వివరించే యూజర్ గైడ్ కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ ఈ కొత్త విధానాన్ని పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.
Rohith Sharma: రోహిత్ మాట్లాడింది వారి గురించేనా? చిట్ చాట్ వీడియో వైరల్
తాజావార్తలు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!