తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకును అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ వన్ లో టాప్ మార్క్స్ 550గా కమిషన్ నిర్ధారించింది. మహిళా అభ్యర్థి టాప్ వన్లో నిలిచింది. 52 మంది 500 కు పైగా మార్క్ లు సాధించారు.
అత్తాపూర్ మెహిందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఆమె భర్త అమిత్ లోయాను అదుపులోకి తీసుకున్నారు. పింకీ సంపాదించిన డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత జరిగిన ఆర్థిక నష్టాలే ఈ విషాదానికి కారణమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. పింకీ సంపాదించిన రూ. 7 లక్షలను అమిత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగా, లాభంతో మొత్తం రూ.…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ఇద్దరు కుమారులు, కుమార్తె మృతి చెందారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన వారు మౌనిక (26), మైథిలి (10), వినయ్ (7), అక్షర (9)గా గుర్తించారు. మృతదేహాల్లో మౌనికదే ఇంకా లభ్యం కాలేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రక్రియలో మరోసారి ఆలస్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పీఆర్సీ కమిషన్ గడువు ఏప్రిల్ 2, 2024న ముగియనుండగా, కమిషన్ ఛైర్మన్ శివశంకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో కమిషన్ గడువును మరో 4 నుంచి 6 నెలల పాటు పొడిగించాలని సూచించారు.
Betting Apps :బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులన్నింటినీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు బదిలీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమాచారం అందిస్తూ, ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదై ఉన్నాయని స్పష్టం చేశారు. నెలలుగా పెద్ద దందాగా మారిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో…
Protest : హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ శ్రీశ్రీ విగ్రహం ముందు ట్రాన్స్జెండర్లు మరియు ట్రాఫిక్ అసిస్టెంట్లు కలిసి నిరసన చేపట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమను అవహేళన చేయడం అనైతికమని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “50 మంది ట్రాన్స్జెండర్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించాం” అని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన చేస్తుండగానే బీఆర్ఎస్కు చెందిన…