కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన బియ్యం.. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.. అయితే, ఒప్పందంలో భాగంగా తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం పంపిస్తున్నారు.. లోడింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్న షిప్‌ను జెండా ఊపి ప్రారంభించారు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి..
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్‌కు ఐజీ ఎం. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి.
తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని ఈ పథకం తీసుకొచ్చామన్నారు. అద్భుతమైన పథకం రూపొంచించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు.. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన చరిత్ర ఉమ్మడి నల్లగొండ జిల్లాది.. పౌరుషాల గడ్డ నల్లగొండ జిల్లా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చారు.…
తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అద్భుతమైన పథకం నా నియోజకవర్గం నుండే ప్రారంభం కావాలని కోరుకున్న.. ప్రస్తుతం అందుతున్న రేషన్ బియ్యం లబ్ధిదారులు తినడం లేదు.. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. 84 శాతం మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందనున్నాయని తెలిపారు. Also Read:Earthquake: టోంగా…
అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన తహసీల్దార్ ఆ మాఫియాకు బిగ్ షాకిచ్చాడు. ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ కార్యాలయానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మాఫియా తహసిల్దార్ కార్యాలయ సిబ్బందికే సవాల్ విసిరుతున్నారు. ఇసుక బకాసురులపై…
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలన్న బండి సంజయ్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని సీతక్క అన్నారు. 2013లో ఆహార భద్రత చట్టాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని సీతక్క స్పష్టం చేశారు. బండి సంజయ్ కి…
కేంద్ర మంత్రి బండిసంజయ్ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని తన నివాసంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్య పండితుల ప్రకారం.. ఈ ఏడాది దొంగతనాలు పెరిగే అవకాశముందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధులు ప్రబలే సూచనలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనను…
ఎవరైనా లా అండ్ ఆర్డర్ ను తప్పించేలా పని చేస్తే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నాను అని సీఎం రేవంత్ తెలిపారు. ఇక, హైదరాబాద్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉండాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.. అందులో భాగంగా మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టాం.. దేశానికి ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నాం.