Komatireddy Venkat Reddy : పేద ప్రజల ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు సన్న బియ్యం పంపిణీ సాహసోపేత నిర్ణయమని తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఇవాళ NTVతో మాట్లాడిన ఆయన, ఈ పథకం వల్ల పేదల ఆత్మగౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. పేదలకు మెరుగైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఆయన వివరించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “గత ప్రభుత్వాలు రేషన్ కార్డుల పంపిణీ విషయంలో…
Payal Shankar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ భూ విక్రయ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ముఖ్యంగా యూనివర్శిటీ భూముల అమ్మకంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన పరిస్థితులను చూస్తుంటే, కేసీఆర్ అహంకారం ఇప్పుడు రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందని పాయల్ శంకర్ అన్నారు. నాడు ఎంపీగా ఉన్నప్పుడు ‘ప్రభుత్వ భూములు అమ్మకూడదు’ అని చెప్పిన రేవంత్ రెడ్డి, నేడు ఏ అధికారంతో భూములను…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేషన్ షాప్లో రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో నేడు 17,263 చాకధరల దుకాణాల ద్వారా 2 లక్షల 91 వేలకు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్నపు బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో తీసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి లేదంటే చౌక ధరల దుకాణదారుకే…
హెచ్సీయూ భూముల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఇవాళ తరగతుల బహిష్కరణకు ఏబీవీపీ పిలుపునిచ్చింది.. నిరసనలు ఉద్ధృతం చేయాలని ఏబీవీపీ నిర్ణయం తీసుకుంది.. ఉదయం 10.30 కు హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేసేందుకు ఏబీవీపీ యత్నిస్తోంది. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం ఈ రోజు వర్సీటీకి వెళ్లనున్నారు. బీజేపీ హెచ్సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తోంది. 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. హెచ్సీయూ మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు సీపీఎం పిలుపునిచ్చింది.…
వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొదంటూ హెచ్సీయూ విద్యార్థులు సోమవారం కూడా ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన ఇద్దరు పరిశోధక విద్యార్థులను రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేల బృందం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లనుంది. హెచ్సీయూ భూములను వారు…
Bank Holidays: భారతదేశంలో బ్యాంకింగ్ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ, సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలంటే బ్యాంక్కు వెళ్లాల్సిన అవసరం ఉండేది. అయితే ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడంతో బిల్లులు చెల్లించడం, డబ్బు బదిలీ చేయడం, ఖాతాల వివరాలను తనిఖీ చేయడం వంటి లావాదేవీలు చాలా సులభమయ్యాయి. అయితే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందడం, లాకర్ సదుపాయం ఉపయోగించడం, ఇలా కొన్ని…