CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విచక్షణాధికారులు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తా అని ఎన్నికల హమీ ఇచ్చానన్నారు.. ఆ హామీ కూడా ఇంకా నెరవేర్చలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఏకమొత్తంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్నారని, ఎన్నిలయ్యాక…
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో తనపై జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. కొన్ని వ్యక్తులు సలహాలు, సూచనలు ఇవ్వడానికే సిద్ధంగా ఉంటారని, కానీ వాటిని పాటించాల్సిన బాధ్యతను అనుసరించరని విమర్శించారు. తనపై రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరించారని, అందువల్లే చంచల్‌గూడ జైల్లో అత్యంత కఠినమైన నక్సలైట్ సెల్లో 16 రోజులు ఉంచారని తెలిపారు. జైల్లో ఉన్న సమయంలో కనీస సౌకర్యాలు…
KTR : తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని, బడ్జెట్లో రాష్ట్రానికి ప్రస్తావన కూడా లేకపోవడం బాధకరమని అన్నారు. కేంద్ర మంత్రులు వరుసగా రాష్ట్రానికి వస్తున్నా, బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆక్షేపించారు. కేంద్ర మంత్రుల పర్యటనలకు ఖర్చు చేయాల్సిన అవసరం రాష్ట్రానికి లేకపోయినా, ఆ ఖర్చును తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించివుంటే మేలు జరిగేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ చేసిన “తల్లిని చంపి…
కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. 20 మంది వార్డు మెంబర్లలో 14 మంది వైసీపీ, ఆరు మంది టీడీపీకి ఉన్నారు. ప్రస్తుతం ఉపసర్పంచ్ ఎన్నిక ఉత్కంఠగా సాగుతోంది. వైసీపీ వార్డు మెంబర్లను టీడీపీ నేతలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దాంతో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో.. పోలీసులు ఇరవర్గాలను చెదరగొట్టారు. దీనిపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. జడ్పీ ఎన్నికల్లో టీడీపీ కుట్ర…
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి నకిరేకల్ పోలీస్‌స్టేసన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. పరీక్షలో మాస్ కాపీయింగ్ నిందితులతో మున్సిపల్ చైర్మన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత, శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్‌పై నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ…
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ శాపం కాకూడదన్నారు. డీలిమిటేషన్ వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదని, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలన్నారు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలన్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతనే లోక్‌సభ సీట్ల పునర్విభజన చేయాలని సీఎం పేర్కొన్నారు. ‘ పునర్విభజన పారదర్శనకంగా జరగాలి.…
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలోని దేవాదుల మూడో దశ ప్యాకేజీ-3 పంప్‌హౌస్ మోటార్లు ఎట్టకేలకు ఆరంభం అయ్యాయి. రాత్రి వరకు పలు కారణాలతో మొరాయించిన మూడో దశలోని దేవన్నపేట పంపు హౌస్ మోటర్లు ప్రారంభమయ్యాయి. దీంతో గోదావరి జలాలు ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. మోటార్లు ఆన్ కావడంతో.. అధికారులు, మెగా కంపెనీ, ఆస్ట్రియా దేశ ఇంజినీర్లు ఆనందం వ్యక్తం చేశారు. దేవన్నపేట వద్ద ఉన్న దేవాదుల పంప్ హౌస్ ప్రారంభం కాకపోవడంతో.. సాగునీరు అందక రైతులు…