* నేడు అహ్మదాబాద్ కు ప్రధాని మోడీ.. విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించనున్న ప్రధాని.. మృతుల కుటుంబాలను పరామర్శించనున్న మోడీ.. టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మాట్లాడిన ప్రధాని మోడీ.. ప్రమాదానికి గల కారణాలను ప్రధానికి వివరించిన టాటా గ్రూప్ ఛైర్మన్..
* నేడు సీఎం చంద్రబాబు వైజాగ్ టూర్ రద్దు.. కూటమి ఏడాది పాలనకు సంబంధించి సుపరిపాలన తొలి అడుగు సభ కూడా రద్దు.. కొన్ని కీలక అంశాలపై సీఎం ఇవాళ సమీక్ష నిర్వహించే అవకాశం..
* నేడు రాజమండ్రిలో ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలనపై ఎగ్జిబిషన్ ఏర్పాటు.. బీజేపీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు.. ముఖ్య అతిథిగా హాజరుకానున్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి..
* నేడు జరగాల్సిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాల నిరసన కార్యక్రమం వాయిదా.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో నిరసన కార్యక్రమం వాయిదా..
* నేడు విశాఖకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రెన్యువబుల్ ఎనర్జీ సెమినార్ లో పాల్గొనున్న భట్టి..
* నేడు పెద్దపల్లి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.. నూతనంగా ఏర్పాటైన ఎలిగేడ్ మండల కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి.. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ని, మహిళా పోలీస్ స్టేషన్ ని ప్రారంభించనున్న పొంగులేటి.. చందపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న మంత్రి పొంగులేటీ..
* నేటి నుంచి విశాఖకు మరో అంతర్జాతీయ విమానం.. అబుదాబికి ప్రారంభం కానున్న విమాన సర్వీసు.. విశాఖ- భువనేశ్వర్ మార్గంలో ఎయిర్ కనెక్టివిటీ.. కొత్త విమానం ప్రారంభం..
* నేడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం.. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి….వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు.