Minister Thummala: ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల కోసం కామంచికల్ రోడ్ కావాలని సత్యం కోరారు.. ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుంది.. నా ఎన్నికల్లో అందరూ కష్టపడి పని చేశారు, రేపు మీ ఎన్నికలు వస్తున్నాయని అంతా కలిసి పని చేసుకోండి అని సూచించారు. పాత పథకాలను నడిపిస్తూనే కొత్త పథకాలను అందిస్తున్నాం.. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది, తప్పుకుండా చేద్దాం మంచి రోజులు వస్తున్నాయి, వర్షాలు ముందే వచ్చాయి.. మీ గ్రామానికి సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని చేద్దాం అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Read Also: OTT Movie : ఓటీటీలోకి ‘DD నెక్స్ట్ లెవల్’.. ఎక్కడ చూడాలంటే?
ఇక, మీ ఇండ్లు తాతలు తండ్రులు కట్టినవి, రోడ్డు వెడల్పు కోసం మీ స్థలాలు కొంత పోతాయి అర్థం చేసుకోండి అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వంకాయలపాటి వెంకయ్య ఊరు ఆయన వెళ్ళేప్పుడు ఏమైనా పట్టుకుని వెళ్ళారా అని చెప్పారు. నేను గ్రామానికి ఒకసారి వస్తా వెళ్తా.. గ్రామాల్లో ఉండేది మీరు శుభ్రంగా ఉంటే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.. ఆసుపత్రికి వెళ్తే ఒక ఎకరం అమ్మవలసి వస్తుంది, అందుకే పరిశుభ్రంగా ఉండండి.. ప్రజలంతా ఖమ్మంలో ఉంటే మంచిది అనే భావన వచ్చింది.. ముఖ్యమంత్రినీ అడిగి ఇంకా 100 కోట్ల రూపాయలు తెచ్చిన పరిశుభ్రంగా ఉండాల్సిన బాధ్యత మీది అని మంత్రి నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.