ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు ఇన్‌ఛార్జి జిల్లాలు మార్చారు. నల్గొండ ఇన్‌ఛార్జిగా ఉన్న తుమ్మలకు కరీంనగర్ బాధ్యతలు.. కరీంనగర్ ఇన్‌ఛార్జి ఉన్న ఉత్తమ్‌కి జిల్లా కేటాయింపు లేదు.. మెదక్ ఇన్‌ఛార్జి కొండా సురేఖ ప్లేస్‌లో వివేక్‌కు చోటు.. ఖమ్మం ఇన్‌ఛార్జిగా ఉన్న కోమటిరెడ్డి ప్లేస్‌లో వాకిటి శ్రీహరికి బాధ్యతలు.. ఆదిలాబాద్ నుండి సీతక్కను నిజామాబాద్‌కి మార్పు.. నిజామాబాద్ నుండి జూపల్లికి ఆదిలాబాద్ బాధ్యతలు.. నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్.. మెదక్ జిల్లా ఇన్‌ఛార్జిగా వివేక్.. పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను మార్చలేదు. పొంగులేటి శ్రీనివాస్ ను వరంగల్ కు కొనసాగింపు.. దామోదర రాజనర్సింహని పాలమూరు లోనే కొనసాగించారు సీఎం రేవంత్.