తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌ను నియమించింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా శశాంక్ గోయల్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read:Vijay Rupani: భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. ఎయిరిండియా ఘటనలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి..
హైదరాబాద్ కలెక్టర్‌గా హరిచందన దాసరిని నియమించింది. టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీగా జే శంకరయ్య, రిజిస్ట్రేషన్స్ అండ్స్ స్టాంప్స్ స్పెషల్ సెక్రెటరీగా రాజీవ్ గాంధీ హనుమంతును నియమించింది. హన్మకొండ కలెక్టర్ గా స్నేహ శబరీష్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా నవీన్ నికోలస్, ఖమ్మం నూతన కలెక్టర్ గా దురిశెట్టి అనుదీప్ నియమితులయ్యారు. స్త్రీ, శిశు సంక్షేమ డైరెక్టర్ గా శ్రీజన, హైదారాబాద్ జిల్లా కలెక్టర్ గా దాసరి హరిచందన, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ గా ప్రియాంకా అలా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీ గా రాజీవ్ గాంధీ హన్మంత్, నిజామాబాద్ కలెక్టర్ గా టి. వినయ్ కృష్ణా రెడ్డి, జీఎడి జాయింట్ సెక్రటరీ గా చిట్టెం లక్ష్మీ నియమితులయ్యారు.