రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎం.పీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా మొక్కలు నాటాలని తన ప్రాంత ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.