నైరుతి ఋతుపవనాలు ఈ రోజు తమిళనాడు, కర్ణాటక అంతటా మరియు మహారాష్ట్రలో మరికొంత భాగం, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో మరి కొంత భాగం మరియు అన్ని ఈశాన్య భారత దేశ రాష్ట్రాలలోకి ప్రవేశించినవి. ఋతుపవనాలు తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రలలో మెదక్, నల్గొండ, రెంటచింతల వరకు ఈ రోజు ప్రవేశించినవి. ఈ రోజు ఉపరితల ద్రోణి నైరుతి మధ్య ప్రదేశ్ నుండి మరత్ వాడ, తెలంగాణ, రాయలసీమ మీదగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిమి వరకు వ్యాపించినది. రాగల 3 రోజులు (06,07,08వ తేదీలు) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఈ రోజు, రేపు (6,7వ తేదీలు)కొన్ని ప్రదేశములలో మరియు ఎల్లుండి (08వ తేదీ) ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.
వాతావరణ హెచ్చరికలు:-
రాగల 3 రోజులు (06,07,08వ.తేదీలు) ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షం తెలంగాణాలోని ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.