కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు
మాజీ ఎంపీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాము. కరోనా నేపథ్యంలో అభివృద్ధి పనులు కొంత లేట్ అయినా మరలా పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకూ 196 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. మరో 200 కోట్లు అభివృద్ధి పనులకు నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ద్వారా కరీంనగర్ అభివృద్ధి అవుతుంది. పివి నరసింహరావు విగ్రహం ఏర్పాటు కోసం మున్సిపల్ కార్పోరేషన్ తీర్మానం చేయడం జరిగింది. చాలా మంది చదువుకున్న మల్టీ పర్పస్ స్కూల్ హరిటేజ్ బిల్డింగ్ కు నిధులు కేటాయించి అభివృద్ధి జరగనుంది. హరిటేజ్ బిల్డింగ్ గా స్కూల్ బిల్డింగ్ ను అత్యాధునికంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం అవుతుంది. కరీంనగర్ నగరంలో వేగంగా స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయి. దేశం క్లిష్ట పరిస్థితి లో ఉన్న తరుణంలో పివి గారి సేవలు అందించారు అని గుర్తుచేసారు.