కెసిఆర్ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. “తెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని చూస్తే రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టమవుతోంది. టెస్టుల నిర్వహణ, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అప్పుడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించింది. అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదు. విద్యాసంస్థలను మాత్రం మూయించి సభలు, ర్యాలీలు, వైన్ షాపులు, పబ్‌లు, క్లబ్‌లు, గుంపులు…
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. అయితే, ఈరోజు రాత్రి నుంచి మే 1 వ తేదీ వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలు సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఎల్పీజీ, సిఎన్జీ, గ్యాస్, కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లు యధావిధిగా నడుస్తాయి. …
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రోను ఏర్పాటు చేశారు. ఈ మెట్రో రైళ్లు ప్రారంభం తరువాత ప్రతి రోజు కనీసం రెండు లక్షల మంది వరకు ప్రయాణం చేసేవారు. అయితే, మొదటి దశ కరోనా సమయంలో మెట్రో రైళ్లు మూతపడ్డాయి. ఆ తరువాత తిరిగి మెట్రో ప్రారంభమైనా చాలా కాలం వరకు పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో మెట్రో సర్వీసులు తగ్గించుకుంటూ వచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో మళ్ళీ సర్వీసులు పెరిగాయి. కాగా,…
ప్రజలలో గందరగోళం సృష్టించే పద్ధతులలో హెల్త్ అండ్ మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటన, మంత్రి ఈటల రాజేందర్ గారి ప్రకటన ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని శ్రీనివాస రావు ప్రకటన చేస్తే దానికి భిన్నంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గాలి ద్వారా కరోనా వ్యాపించదని చెప్పడమంటే ప్రభుత్వానికి కరోనా మీద పైన అవగాహన లేనట్లు కనిపిస్తుంది. ఇలాంటి ప్రకటనలతో…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఓ కరపత్రం ఇప్పుడు కాకరేపుతోంది.. ఈ వ్యవహారంతో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది.. ప్రజాప్రతినిధులు డబ్బులు అడుగుతున్నారంటూ రిలీజ్ అయిన పాంప్లెట్ ఇప్పుడు వరంగల్ లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ కరపత్రాలు హల్చల్ చేస్తున్నాయి.. వివరాల్లోకి వెళ్తే.. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు.. రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ ఓ కరపత్రం…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే 10 శాతానికి పైగా కరోనా వృద్ధి కనిపించింది. దీంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ ను తప్పనిసరి చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపాపధ్యంలో ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండల కేంద్రంలో గత రెండు రోజుల వ్యవధిలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. మండలకేంద్రంలో వారం రోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్…
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. తెలంగాణ కు మహారాష్ట్ర నుంచి ఎక్కువ వ్యాప్తి ఉంది అని DH.శ్రీనివాస్ తెలిపారు. 24 మార్చి మొదటి వారంలోబార్డర్ జిల్లాకు మహారాష్ట్ర నుంచి 20 మంది వచ్చారు. ఓ ఫెస్టివల్ కు హాజరయ్యారు. ఈ ఘటనలో 430 మందికి వైరస్ సోకింది. గాలిద్వారా కరోనా వ్యాప్తి జరుగుతోంది. తెలంగాణ లో ప్రతి రోజు లక్ష మందికి పైగా టెస్టులు చేస్తున్నాం.15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయింది. రెండురోజులుగా బెడ్స్ సమస్య…
రెండు రోజులుగా బెడ్స్ సమస్య తలెత్తుతుంది అని తెలంగాణా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మొదట్లో 40 శాతం బెడ్ అక్కుపెన్సి ఉందన్న ఆయన ఇప్పుడు 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు. 1935 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అనుమతి ఇచ్చామని, వంద మందికి కరోనా వస్తే 80 శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేవని అన్నారు. కేవలం 7 నుంచి 8 శాతం ఆస్పత్రిలో చేరుతున్నారని అయన అన్నారు. కరోనా పాజిటివ్ అనగానే…
ఐఏఎస్ ను అంటూ బురిడీ కొట్టించాడు..జాయింట్ పోస్టింగ్ వచ్చిందని నమ్మించాడు..నేమ్ ప్లేట్ రెడీ చేసుకున్నాడు..సైరన్ పెట్టుకున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని చెప్పి ముందుగా డ్రైవర్ ,పీఏను నమ్మించి వేతనాలు పెంచాడు…అలా నమ్మించి ఒక్కటి కాదు రెండు ఏకంగా 80 లక్షలు వసూలు చేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాదితులు స్టేషన్ మెట్లెక్కితే సూడో ఐఏఎస్ అని తేల్చిన ఖాకీలు అసలు బాగోతం బయటపెట్టారు. బర్ల లక్ష్మీనారాయణ, హైదరాబాద్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు..ఈ క్రమంలో తన గ్రామంలో…