ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇంటర్ పరీక్షలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. టేబుల్ ఐటమ్ గా ఇంటర్ ఎగ్జామ్స్ ఇష్యూ ఉంది. కొద్దిసేపటి క్రితమే అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం ముందు ఉన్న ఆప్షన్స్… పరీక్షలు రద్దు చేసి ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఆధారంగా రిజల్ట్స్ ప్రకటించడం లేదా పరీక్ష సమయం తగ్గించి సగం ప్రశ్నలకే జులై 15 తర్వాత పరీక్షలు నిర్వహించడం. చూడాలి మరి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది.