స్వంతంగా రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ (టీకా) ఇవ్వడం జరిగిందని, మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇలా మొత్తం అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు 2500…
కోవిడ్ నివారణ పద్ధతులపై, వ్యాక్సినేషన్ పై మరింత అవగాహన పెంచడానికి జాతీయ సేవా పథకం, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వైస్ ఛాన్సలర్ లకు సూచించారు. రాష్ట్రంలో కోవిడ్ ఉధృతమవుతున్న సందర్భంలో, ప్రజలలో మంచి అవగాహన, చైతన్యం కలిగించడం అత్యంత ఆవశ్యకమని గవర్నర్ తెలిపారు. ప్రజలు సరైన విధంగా మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెంసింగ్ పాటించడం, గుంపులుగా గుమికూడకుండా ఉండటం ఇలాంటివి కోవిడ్ నివారణ,…
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పిడిగుపాటు వార్త చెప్పిందని.. రెమిడిసివేర్ ఇంజక్షన్లు కేంద్రం పరిధిలోకి తీసుకుందని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. ఇది చాలా బాధాకరంగా ఉందని..కేంద్రం నిర్ణయానికి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన రెమిడిసివేర్ మాకు అవసరం ఉన్నంత ఇవ్వాలని…దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించారు ఈటల. రెమిడిసివేర్ కొరత రాకుండా.. 4 లక్షల వైల్స్ కి ఆర్దర్…
నూతన గ్రామ పంచాయతీల్లో ఇంకా ఫిషింగ్ రైట్స్ వివాదం పరిష్కారం కాలేదు. పంచాయతీరాజ్, మత్స్యశాఖ అధికారులతో ఒక దఫా సమావేశం నిర్వహించిన సీఎస్… చీఫ్ సెక్రటరీకి కరోనా ఉన్నందున తదుపరి సమావేశాలు నిర్వహించలేకపోయారు. గతంలో టీఎస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పంచాయతీరాజ్ శాఖకు ఇరు శాఖల అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకు రెండు వారాల సమయం కూడా ఇచ్చింది హైకోర్టు. కానీ మరో మూడు వారాలు గడువు పొడించాలని ప్రభుత్వం…
తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి.. ఇప్పటికే మూడు నాలుగు రోజుల నుంచి అక్కడక్కడ భారీ గాలులతో కూడా వర్షాలు కురుస్తుండగా.. ఇప్పుడు విదర్భ మరియు మరత్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి మి నుండి 2.1 కిమి ఎత్తు మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడింది.. ఈ రోజు ఉత్తర- తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5…
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోవడంతో అనేక జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ కావాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు ఉదయం రాష్ట్రానికి 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 7.5 లక్షల డోసులు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చిన 6 లక్షల డోసులను అవసరమైన జిల్లాలకు ప్రభుత్వం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు ఆరువేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే, ఈనెల 30 వ తేదీన రాష్ట్రంలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈరోజు మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి, సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆమె కోరారు. కరోనా…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6,542 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.67 లక్షలకు చేరింది. ఇందులో 3.19 లక్షల మంది డిశ్చార్జ్ కాగా, 46,488 కేసులు యాక్టివ్ గా…
ప్రతి ఏడాది రాములోరి కళ్యాణాన్ని భద్రాచలం రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. అయితే, గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించారు. భక్తులు లేకుండానే కళ్యాణం జరిగింది. ఇక ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మరోసారి ఆలయాలు మూతపడ్డాయి. ఈరోజు జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా భక్తులు…
ఈ నెల 30 వ తేదీన రంగారెడ్డి అర్బన్ జిల్లా లింగోజీగూడ డివిజన్ కు జరుగుతున్న ఉపఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి రంగారెడ్డి జిల్లా బిజెపి జిల్లా కమిటీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ని కలిసిన సందర్భంగా ఏర్పడిన పరిస్థితులపై, కలవడానికి దారితీసిన పరిస్థితులపై వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే బిజెపి రాష్ట్ర పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా లింగోజిగూడ డివిజన్ నుంచి…