కరోనా మహమ్మారితో ఆర్థిక సంక్షోభం తలెత్తిందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.. ఇక రూ. 500 కోట్లతో అన్ని మున్సిపాలిటీలలో మార్కెట్లు సిద్ధం చేశామన్న ఆయన.. మెట్ పల్లిలో 2.57 కోట్ల రూపాయలతో వెజ్ ఆ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేశామని.. 138 మున్సిపాల్టీల్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.. మున్సిపాలిటీలకు ప్రతి నెలా రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రతీ మున్సిపాలిటీకి జనాభా ప్రకారం పట్టణ ప్రగతి నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు కేటీఆర్.. జగిత్యాల జిల్లాకు మెడికల్ నర్సింగ్ కళాశాల మంజూరు అయ్యిందని ఈ సందర్భంగా ప్రకటించిన ఆయేన.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు గత 65 సంవత్సరాలలో అన్ని ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు నాలుగు మాత్రమేనని గుర్తుచేశారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సరాలలో 7 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సిద్ధం చేస్తోందన్న కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన వైకుంఠ దామలు ఏర్పాటు చేసిందన్నారు.. సుమారు 325 కోట్లతో141 మానవ వ్యర్థ పదార్థాల శుద్దికరణ కేంద్రాలను మున్సిపల్ కార్యాలయంలో కడుతున్నట్టు వెల్లడించారు.