ఆయనో బీసీ మంత్రి…. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ఆయనే.. వారి అసైన్డ్ భూములపై కన్నేశాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పేదలను భయపెట్టాడు.. నాయానో భయానో భూములు కాజేసేందుకు అధికారాన్ని అడ్డుగోలుగా వాడుకున్నాడు. మంత్రి దర్పాన్ని.. భూములు కాజేసేందుకు పేదలను భయపెట్టేందుకు వాడుకున్నాడు. కోళ్ల ఫామ్ల కోసం తోడేలుగా మారి రైతుల భూములను మింగేశాడు. అతనే తెలంగాణలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్. ఆయన భార్య జమున పేరుతో హ్యాచరీస్ వ్యాపారం…
మూడు రోజుల నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసరప్రాంతాల నుండి విదర్భ వరకు సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వరకు ఏర్పడినది. మరియు ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ర్ట దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కి మి ఎత్తు వద్ద ఏర్పడినది. ఈ రోజు (30వ తేదీ) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు,…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వెంటనే కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలంటూ.. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు… డీఎంహెచ్వోలకు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ను వినియోగించుకునే వీలు కల్పించింది.. మిగతా టీకాలను వెంటనే సేకరించాలని హెల్త్ డైరెక్టర్ ఆదేశించారు.. కాగా, జనవరి 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్…
తెలంగాణ సిఎం కెసిఆర్ కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ కు నిన్న నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. మొన్నటి యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు ఎం.వీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్…
తెలంగాణ సర్కార్ పై మరోసారి టీఎస్ హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ నేటితో ముగుస్తుంది.. అయినా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది. ఉదయమే కేసు ఉన్నా మధ్యాహ్నం వరకు సమయం కోరిన ప్రభుత్వం.. మధ్యాహ్నం తర్వాత కూడా నిర్ణయం వెల్లడించలేదు అడ్వాకేట్ జనరల్. మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు..నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించింది. సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఏజీ.…
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.. అయతే, నిన్న హోంశాఖమంత్రి మహమూద్ అలీ.. పోలీసులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం.. లాక్డౌన్పై సీఎం కేసీఆర్దే తుది నిర్ణయమంటూ ప్రకటించడంతో.. ఈ నెల 30 తర్వాత తెలంగాణలో లాక్డౌన్ తప్పదా? అనే చర్చ మొదలైంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. అసలు లాక్డౌన్ పెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.…
బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని మాట్లాడడం పట్ల తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై అసహ్యించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్ నుండి 5 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది .ఇంకా 12 ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేసుకోవడానికి నిధులు ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నకిరేకల్ మున్సిపాల్టీలో ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగనే అన్నారు.. ఆంధ్రప్రదేశ్లో వెయ్యి రూపాయలు దాటిన వైద్యం అంతా ఆరోగ్య శ్రీలోనే అన్న ఆయన.. కరోనా ట్రీట్ మెంట్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారంటూ ప్రశంసించారు.. అయితే, కరోనా వైరస్ బారినపడి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో…
భారత్లో కరోనా వైరస్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే, కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది అని మండిపడ్డారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ప్రధాని మోడీకి ముందుచూపు లేకపోవటం వల్లే కరోనా వైరస్ విజృంభించిందని విమర్శించారు.. దేశంలో కరోనాతో ప్రస్తుత పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని.. ఇప్పటికైనా మహమ్మారి కట్టడికోసం చర్య తీసుకోవాలన్నారు.. తెలంగాణలో కూడా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఒవైసీ..…
టిఆర్ఎస్ పాలన మీద చార్జిషీట్ విడుదల చేసిన బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ… 2014 లో సైకిల్ మీద తిరిగే వాళ్ళు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. కోమటి చెరువు అభివృద్ధి పేరుతో పేదల డబ్బులను వృధా చేశారు. ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట కు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చి, ఎంత మందికి ఉపాధి కల్పించారు. ఇక్కడ ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీలా గా మారింది. 12 వేల మంది డబుల్ బెడ్ రూమ్…