ప్రతి ఏడాగి మృగశిర కార్తె రోజున హైదరాబాద్ చేప మందు ప్రసాదం పంపిణీ జరుగుతుంది. కానీ, కరోనా కారణంగా చేప మందు ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. జులై 8 వ తేదీన చేపమందు పంపిణీ చేయడం లేదని ఇప్పటికే బత్తిన సోదరులు ప్రకటించారు. మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు తీసుకోవడం వలన ఆస్తమా నుంచి ఉపశమనం పోందవచ్చనే ప్రచారం జరగడంతో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రామ్‌నగర్ చేపల మార్కెట్‌కు చేరుకున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మార్కెట్‌కు ప్రజలు చేరుకోవడంతో రద్ధీ ఏర్పడింది. భౌతిక దూరం సాద్యం కావడం లేదు. ఇప్పటికే నిబంధనలు పాటించని కొన్ని దుకాణాలకు జరిమానా విధించారు.