ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రాగల 2 నుండి 3 రోజులలో ఋతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. నిన్న మరత్వాడ నుండి ఉత్తరా ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీనపడినది. ముఖ్యంగా ఈ రోజు క్రింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణా రాష్ట్రంలోకి వస్తున్నవి. దీంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఈ రోజు (08వ.తేదీ) ఒకటి రెండు ప్రదేశములలో, మరియు రేపు, ఎల్లుండి…
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షకు హాజరు అయ్యారు సంగా రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రోడ్ల పైకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఆందోళనలు, ధర్నాలు ఉండవని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఏమి చేస్తుంది. ధాన్యం తరలింపు సక్రమంగా లేదు.. తీవ్ర ఇబ్బందులున్నాయి. ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప అక్కడ ఎలాంటి…
సిఎం కెసిఆర్ పై మరోసారి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ డబ్బులు, దౌర్జన్యంతో గెలవలేడని, ఇది కౌరవులు, పాండవుల మధ్య జరిగే యుద్ధం అని పేర్కొన్నారు. 19 సంవత్సరాలు గులాబీ జెండాను మోసానని.. కష్టకాలంలో అండగా ఉన్న నన్ను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులను మాత్రం పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. రూ. 100 కోట్లతో బ్లాక్ మెయిల్ చేసినా తనను ఎవరూ కొనలేరు అని ఈటల పేర్కొన్నారు.…
ప్రతి ఏడాగి మృగశిర కార్తె రోజున హైదరాబాద్ చేప మందు ప్రసాదం పంపిణీ జరుగుతుంది. కానీ, కరోనా కారణంగా చేప మందు ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. జులై 8 వ తేదీన చేపమందు పంపిణీ చేయడం లేదని ఇప్పటికే బత్తిన సోదరులు ప్రకటించారు. మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు తీసుకోవడం వలన ఆస్తమా నుంచి ఉపశమనం పోందవచ్చనే ప్రచారం జరగడంతో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రామ్నగర్ చేపల మార్కెట్కు చేరుకున్నారు. ఒక్కసారిగా…
సైబర్ నేరగాళ్ళ కొత్త తరహా మోసం బయట పడ్డింది. సంస్థల వెబ్ సైట్ లో సిఈఓ మెయిల్ పేరుతో నకిలీ మెయిల్ తయారు చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. తెలంగాణ గనులు భూగర్భ శాఖ డైరెక్టర్ పేరుతో నకిలీ మెయిల్ పంపించారు. తాను మీటింగ్ లో ఉన్నానని.. అత్యవసరంగా 10 వేల రూపాలయల యామెజాన్ గిఫ్ట్ కార్డ్ పంపాలని క్రింది స్థాయి ఉద్యోగులకు మెయిల్ పంపారు. నిజమే అనుకుని గిఫ్ట్ కార్డ్ పంపారు నిజామాబాద్ గనుల శాఖ అధికారి.…
ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇంటర్ పరీక్షలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. టేబుల్ ఐటమ్ గా ఇంటర్ ఎగ్జామ్స్ ఇష్యూ ఉంది. కొద్దిసేపటి క్రితమే అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం ముందు ఉన్న ఆప్షన్స్… పరీక్షలు రద్దు చేసి ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఆధారంగా రిజల్ట్స్ ప్రకటించడం లేదా పరీక్ష సమయం తగ్గించి సగం ప్రశ్నలకే జులై…
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మూడో విడత లాక్డౌన్ గడువు ఈ నెల 9తో ముగుస్తుంది. దీంతో తదుపరి కార్యాచరణ కోసం కేబినెట్ మరోసారి సమావేశమవుతోంది. లాక్ డౌన్ సడలింపుపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న…
తెలంగాణలో కరోనా రోజువారి కరోనా కేసులు రెండు వేల దిగవకు చేరుకున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంట్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 16 మంది కరోనా పొట్టనబెట్టుకుంది.. ఇదే సమయంలో .. గడిచిన 24 గంటల్లో 3,527 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,406 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ.. నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్.. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. అనతికాలంలో రెండు పంటలకు రెండుకోట్ల ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామన్నారు.. దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తితో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలోకి ఎదుగుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆహార…
తెలంగాణలో స్కూల్స్ రేషనలైజేషన్ పై విద్యాశాఖలో చర్చ నడుస్తోంది.. అయితే, హేతుబద్దీకరణ చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.. రేషనలైజేషన్ చేస్తే రాష్ట్రంలో 3 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉందంటున్నారు.. దీనిపై 2015-16లో హేతుబద్దీకరణ పై ప్రభుత్వం ఆలోచించినా.. మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. అయినా, పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై పరిస్థితి మెరుపడలేదు.. రాష్ట్రంలోని 1243 పాఠశాలల్లో జీరో అడ్మిషన్స్ దీనికి నిదర్శనం.. ఒక్క విద్యార్థి కూడా లేని వాటిలో…