Amara Charitable Trust: పేదల సాధికారతకు ‘అమరా ఛారిటబుల్ ట్రస్ట్’ చేయూత.. బోగోలు అభివృద్ధికి రూ.15 కోట్ల విరాళం!
- పేదల సాధికారతకు అమరా ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత
- బోగోలు అభివృద్ధికి రూ.15 కోట్ల విరాళం
- మంత్రి నారా లోకేష్‌ను కలిసిన బచ్చు కృష్ణ కుమార్ దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేదల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ భారీగా సహకారం అందించనుంది. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిసి తమ సహాయాన్ని ప్రకటించారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.5 కోట్ల సాయం అందించనున్నట్లు తెలిపారు. త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించారు.
పీ-4 కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మన బడి – మన భవిష్యత్ పథకం కింద బోగోలు మండలంలోని పలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు, పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దాతలు ఇచ్చే విరాళాల ఆధారంగా ఆయా పాఠశాలలకు వారి పేర్లు పెట్టుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు త్వరలోనే ‘మన బడి – మన భవిష్యత్’ వెబ్‌సైట్ను కూడా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: Sanju Samson Award: సంజు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’పై రచ్చ.. మిచెల్ సాంట్నర్ కీలక వ్యాఖ్యలు!
అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ విద్యా రంగంతో పాటు ఆరోగ్య, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికీ చేయూత అందిస్తోంది. బోగోలు మండలం కొవ్వూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కోసం రూ.5 కోట్ల సాయం అందించనుంది. అదేవిధంగా కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం మరో రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ విధంగా విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మిక రంగాల్లో మొత్తం రూ.15 కోట్ల సహాయం అందించనున్న అమరా ఛారిటబుల్ ట్రస్ట్ చర్యలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!