కరోనా మహమ్మారితో ఆర్థిక సంక్షోభం తలెత్తిందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.. ఇక రూ. 500 కోట్లతో అన్ని మున్సిపాలిటీలలో మార్కెట్లు సిద్ధం చేశామన్న ఆయన.. మెట్ పల్లిలో 2.57 కోట్ల రూపాయలతో వెజ్ ఆ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేశామని.. 138 మున్సిపాల్టీల్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.. మున్సిపాలిటీలకు ప్రతి నెలా…
పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎట్టకేలకు స్పందించారు. జూన్ 1న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసి సీఎం కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేసారని చెప్పారని ఎల్ రమణ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిసి…రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచన చేస్తున్నారని అడిగారని కూడా ఆయన తెలిపారు. గతంలో కూడా టిఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది…ఇది కొత్త ఏం కాదని వెల్లడించారు. పార్టీ…
మంత్రి కేటీఆర్ పై బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కేటీఆర్ కు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? అని ప్రశ్నించారు రాములమ్మ. వ్యాక్సిన్ అనేది గంటలలోనో… రోజులలోనో… ఉత్పత్తి అయి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదని… అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి విజన్ లేదు.. ప్లాన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి సరైన విజ్ఞత లేదని…
టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైందని.. ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. టీఆరెస్ పార్టీ ఒక గడిలా పార్టీ అని.. నిజాంను మైమరిపించే విధంగా ఒక రాక్షస నిరంకుశ పాలన కోనసాగిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఈటెలకు ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా జరిగిందంటే మిగతా వాళ్లు కూడా ఆలోచించు కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.…
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీలో చేరకముందే ఆ పార్టీలో కాకరేగింది.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముందే ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా, మరోనేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చగా మారాయి.. ఇక, పార్టీలో చేరికకు ముందు.. ఢిల్లీలో మకాం వేసి.. తనకుఉన్న అనుమానాలను బీజేపీ అధిష్టానం ముందు పెట్టిన ఈటల.. ఈ సందర్భంగా హామీ కూడా తీసుకున్నట్టు ప్రచారం జరిగింది.. కానీ, ఈటల రాజేందర్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం…
తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నానని వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆరే టార్గెట్ గా షర్మిల పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా తెలంగాణ వైయస్సార్ అభిమానులకు వైఎస్ షర్మిల గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షర్మిల పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు వైఎస్ షర్మిల లోటస్ పాండ్…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేకనే ఈ పరిస్థితులు వచ్చాయి అని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ పరిస్థితి కారణం ప్రధాని మోడీ ,సీఎం కేసీఆరే అని తెలిపారు. గతేడాది అసెంబ్లీలో భట్టి విక్రమార్క అడిగితే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని అడిగితే ఒప్పుకున్నాడు. 9నెలలు అవుతున్న ఇప్పటికి అమలు లేదు. ఎన్నికల్లో గెలవడం, నాయకులను కొనడం పైనే కేసీఆర్ దృష్టి ఉంది. ఎంతోమంది చనిపోతున్న కేసీఆర్ కు పట్టింపులేదు. ధనిక రాష్ట్రం…
మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు కప్పి పుచ్చుకోవడానికి…నిర్లక్ష్యాన్ని కేంద్రంపై మోపుతున్నారని… కేటీఆర్ కళ్లు ఉన్నోడు అయితే ఇలాంటి విషం చిమ్మడని మండిపడ్డారు. ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే కుళ్లు మనస్తత్వం కేటీఆర్ ది అని.. భారత్ బయోటెక్ ను వాళ్ళు విజిట్ చేశారా.. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసారా? అని నిలదీశారు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. ట్విట్టర్ మంత్రిగా మారిపోయారు… హైటెక్ మంత్రిగా గొప్పలు చెప్పుకుంటున్నాడని..…