ప్రజాప్రతినిధులు, నేతలు… నిత్యం ప్రజల్లో ఉండేందుకు పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతుంటారు.. ఓదర్చే సమయంలో ఓదారుస్తూ.. ఉత్సాహంగా ఉన్న సమయంలో.. మరింత వారిని ఉత్సాహ పరుస్తుంటారు.. ఇక, కొన్ని సార్లు.. కార్యకర్తలు, అభిమానుల కోర్కె మేరకు కూడా.. కొన్ని సార్లు కాలు కదపాల్సి వస్తుంది.. ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ స్టెప్పులు వేశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.. అక్కడ డీజే సౌండ్ల మధ్య స్టెప్పులు వేస్తూ అందరిని అలరించారు. తన నియోజకవర్గంలోని కారేపల్లి మండలం పాటిమీద గుంపు గ్రామంలో గ్రామ సర్పంచ్ బాణోత్ శంకర్ పెళ్లి వేడుక జరగగా.. ఆ పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే డ్యాన్స్‌లు వేశారు.. అందరితో కలిసి ధూమ్ దాం చేశారు.. ఆయనతోపాటు పెళ్లికి వచ్చినవారంతా కూడా డ్యాన్సులు చేశారు… ఈలలు, కేకలుతో పెళ్లి వేడుక ఉత్సాహంగా మారిపోయింది.