తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ పూర్తిస్థాయిలో ముగిసిన థియేటర్ల ఓపెనింగ్స్ పై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు అవుతుండగా.. విడుదలకు రెడీగా వున్నా సినిమాలు థియేటర్లపై దూకేందుకు వెనకడుగు వేస్తున్నాయి. విడుదల తేదీలను సైతం ప్రకటించేందుకు సిద్దపడట్లేదు. తెలంగాణలో తెరలు తెరిచేందుకు పర్మిషన్ ఉండగా.. ఏపీలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా వెనకడుగు వేస్తున్నారు. అయితే జులై లోనైనా పరిస్థితులు మారుతాయని అనుకొనే పరిస్థితి కూడా కనిపించటం లేదు. ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు కొత్త సినిమాలు వస్తాయో తెలియని ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఉన్నట్లు కనిపించటం లేదు. ఎంతకాదనుకున్న జులై చివరి వారంలోనే రెండు రాష్ట్రాల్లోని తెరలు పూర్తిస్థాయిలో తెరచుకొనే అవకాశం కనిపిస్తోంది. లేదనుకుంటే ఆగస్టు నెల వరకు ఎదురుచూడక తప్పదు.