ఏడో విడత హరితహారం.. 20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో చెట్లు నాటడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. చెట్లు నాటడమే కాదు.. వాటి పరిరక్షణ బాధ్యతను కూడా సీరియస్‌గా తీసుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు విడతలుగా హరితహారం నిర్వహించగా… ఏడో విడతకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం… ఈసారి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 కోట్లు మొక్కలు… నాటేందుకు ప్లాన్ చేస్తున్నారు.. 2015లో ప్రారంభమైంది హరితహారం 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించుకుంది.. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం నర్సరీల సంఖ్య 15,241గా ఉండగా… అందుబాటులో ఉన్న మొక్కల సంఖ్య సుమారు 25 కోట్లుగా చెబుతున్నారు.. ఈసారి బహళ రహదారి వనాలకు (మళ్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్) ప్రాధాన్యత ఇవ్వనున్నారు.. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయితీ రోడ్ల వెంట బహుళ వనాలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు.. వీలున్న ప్రతీ చోటా యాదాద్రి (మియావాకీ) మోడల్ లో చెట్లు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.. ఇక, ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి.., పెంచే బాధ్యత ఆయా కుటుంబాలకు అప్పగించనున్నారు.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలని నిర్ణయానికి వచ్చారు..
జులై 1 నుంచి 10 దాకా పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై రాష్ట్ర మంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది ప్రభుత్వం.. ప్రతీ ప్రాంతంలో అటవీ భూముల గుర్తింపు, అటవీ పునరుద్దరణకు చర్యలు తీసుకోనున్నారు.. అటవీ బ్లాకుల వారీగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అటవీ పునరుద్దరణ ప్రణాళికలు చేపట్టనున్నారు.. పటిష్ట చర్యలు, పర్యవేక్షణ ద్వారా అటవీ భూములు, సంపద రక్షణ చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు.. దీనికోసం ఇప్పటికే గ్రీన్ బడ్జెట్ నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొక్కలు నాటే మిగతా శాఖలకు సాంకేతిక సహకారాన్ని అటవీ శాఖ అందించనుంది.. ప్రతీ విద్యా సంస్థ, ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల ఖాళీ స్థలాల్లో ఖచ్చితంగా పచ్చదనం పెంపుకు చర్యలు తీసుకోవాలని.. ప్రతీ మండల కేంద్రంతో పాటు, పట్టణ ప్రాంతాలకు సమీపంలో పెద్ద ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రాధాన్యత కల్పించాలని.. ఖచ్చితంగా 85 శాతం మొక్కలు బతికేలా పంచాయతీ రాజ్ చట్టం అమలుకు నిర్ణయం తీసుకున్నారు.. అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.. గత ఆరు విడతల్లో నాటిన మొక్కలు మొత్తం 220.70 కోట్లు కాగా.. అడవుల బయట 159.88 కోట్ల మొక్కలు.. అడవుల లోపల 60.81 కోట్ల మొక్కలు నాటారు.. హరితహారం కోసం ఇప్పటిదాకా అయిన ఖర్చు (అన్ని శాఖలు కలిపి) 5,591 కోట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక (2019) ప్రకారం రాష్ట్రంలో 3.67 శాతం పచ్చదనం పెరుగుదల నమోదైంది.. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది జరగగా.. ఇప్పటికే పూర్తయిన పార్కులు – 53 ( 35 ప్రజలకు అందుబాటులోకి, 18 రెడీగా ఉన్నాయి.)గా ఉన్నాయి.. మిగతా 56 అర్బన్ ఫారెస్ట్ పార్కులను రానున్న ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!