ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది… రాష్ట్రంలోని పలు సమస్యలపై చర్చించన కేబినెట్.. ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిన తెలంగాణ-ఏపీ జల వివాదంపై చర్చించింది… తెలంగాణలో ఏపీ ప్రజలున్నారు.. వాళ్లకు ఇబ్బంది కలగకూడదనే సంయమనంతో ఉన్నామని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.. టీఆర్ఎస్ నేతలు దూకుడుగా మాట్లాడుతున్నారన్న సీఎం.. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.. ఇక, జల వివాదాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్.. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. చుక్కనీరు కూడా వదిలే ప్రసక్తేలేదని పేర్కొంది… శ్రీశైలంలో విద్యుత్‌ఉత్పత్తి ఆపేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి మరో లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు.. ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.