కాంగ్రెస్ కి చావు లేదు… వచ్చే టోల్లు వస్తారు… పోయే వాళ్ళు పోతారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారం, పది రోజుల్లో పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుంది. పీసీసీ చీఫ్ పదవి తప్పితే… ఏ పదవి తీసుకోను. పీసీసీ పదవి ముఖ్య మంత్రి పదవి కాదు. పీసీసీ ఇస్తే రాష్ట్రం అంతా తిరుగుతా.. లేదంటే ఉమ్మడి నల్గొండలో మెజారిటీ సీట్లు గెలిపించే బాధ్యత తీసుకుంటా అని తెలిపారు. నాకు పదవులు ముఖ్యం కాదు. రాజగోపాల్ రెడ్డితో..…
కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారుమాజీ ఎంపీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాము. కరోనా నేపథ్యంలో అభివృద్ధి పనులు కొంత లేట్ అయినా మరలా పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకూ 196 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. మరో 200 కోట్లు అభివృద్ధి పనులకు నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ద్వారా కరీంనగర్…
తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కరోనా కేసులు తగ్గుతుండటంతో లాక్డౌన్ పరిమితులను సడలించే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం వరకు సడలింపులు ఉండటంతో సడలింపులు ఉన్న సమయంలోనే శుభకార్యాలు నిర్వహిస్తున్నారు. శుభకార్యాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరవుతుంటారు. ఇలాంటి శుభకార్యాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోంది. తాజాగా, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం కంఠం గ్రామంలో జరిగిన ఓ శుభకార్యం కొంపముంచింది. ఈ శుభకార్యం జరిగిన తరువాత గ్రామంలో గత వారం…
రాష్ట్రంలో కరోనాకు, బ్లాక్ ఫంగస్కు పూర్తిగా ఉచిత చికిత్సను అందించాలని డిమాండ్ చేస్తు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు హైదరాబాద్లోని గాంధి భవన్లో సత్యాగ్రహ దీక్షకు దిగుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎం.పీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా మొక్కలు నాటాలని తన…
లాక్డౌన్ ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. లాక్డౌన్ వల్ల తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 97,751 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 1436 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. కరోనా బారినపడి మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 5,91,170 కరోనా కేసులు, 3378 మరణాలు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో.. 3,614…
డయాగ్నస్టిక్ సెంటర్ల ఓపెనింగ్ పై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి (7న) ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్లను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని వొకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సిఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సిఎం…
నైరుతి ఋతుపవనాలు ఈ రోజు తమిళనాడు, కర్ణాటక అంతటా మరియు మహారాష్ట్రలో మరికొంత భాగం, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో మరి కొంత భాగం మరియు అన్ని ఈశాన్య భారత దేశ రాష్ట్రాలలోకి ప్రవేశించినవి. ఋతుపవనాలు తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రలలో మెదక్, నల్గొండ, రెంటచింతల వరకు ఈ రోజు ప్రవేశించినవి. ఈ రోజు ఉపరితల ద్రోణి నైరుతి మధ్య ప్రదేశ్ నుండి మరత్ వాడ, తెలంగాణ, రాయలసీమ మీదగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9…
లాక్డౌన్ ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. లాక్డౌన్ వల్ల తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పగటివేళల్లో లాక్డౌన్ను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో కరోనా ఉధృతంగా ఉండటంతో.. తొలుత నెల రోజులపాటు రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. ఆ తర్వాత మే 12 నుంచి 30 వరకు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చింది.…
వికారాబాద్ జిల్లాలో పరిగిలో రైతులు ఆంధోళనలకు దిగారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. పండించిన వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధోళనలు చేస్తున్నారు. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రైతులు బైఠాయించారు. రోడ్డుపై రాళ్లు పెట్టి వాహనాలను ఆపేశారు. దీంతో దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. కలెక్టర్ వచ్చి స్ఫష్టమైన హామీ ఇచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ అమలు జరుగుతున్నది. మధ్యాహ్నం…