కరోనా సమయంలో పీజీ విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది ఉస్మానియా యూనివర్సిటీ… పీజీ పరీక్షలు రాసే విద్యార్థులు.. తమకు దగ్గర్లో ఉన్న జిల్లా కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది… విద్యార్థి తనకు ఏ సెంటర్ అందుబాటులో ఉందని భావిస్తున్నాడో… ఏ సెంటర్‌లో పరీక్ష రాయాలని అనుకుంటున్నాడో.. ముందే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.. ఒకవేళ ఒక సెంటర్ లో 20 మంది విద్యార్థులు ఉంటే ఆ సెంటర్ ను మార్చడం జరుగుతుందని ఓయూ తెలిపింది.. పరీక్షా సమయం 2 గంటలుగా నిర్ణయించగా… తెలంగాణలో మొత్తం 25 చోట్ల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.