జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీపతి రవి (50) గత కొంతకాలంగా మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యునిగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నెల క్రితం కరోనా మహమ్మారి సోకడంతో దానికి చికిత్స పొందుతున్నాడు. అయితే పది రోజుల క్రితం బ్లాక్ ఫంగస్ సోకడంతో హైదరాబాదులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య కుమార్తె,కుమారుడు ఉన్నారు.