యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో లాకప్‌డెత్ సంచలనంగా మారింది.. పోలీసు దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ అనే మహిళ మృతిచెందినట్టుగా తెలుస్తోంది.. ఇది ముమ్మాటికీ లాకప్ డెత్ అని మరియమ్మ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తి.. అడ్డగూడూరు మండలంలోని గోవిందాపురంలో ఫాదర్ బాలశౌరి ఇంట్లో రూ.2 లక్షలు చోరికీ గురయ్యాయి. పనిమనిషి మీద అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పాస్టర్.. మొదట మరియమ్మ, ఆతర్వాత ఆమె కొడుకు ఉదయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు..…
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. క్రమంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నా.. కొన్ని భయాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.. అయితే, అక్కడక్కడ నర్సులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. హైదరాబాద్ శివారులో విధుల్లో ఉన్న నర్సు ఫోన్ మాట్లాడుతూ.. ఓ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసింది.. కాసేపటికి కళ్లు తిరిగిపడిపోయిన ఆ యువతిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ వ్యాక్సినేషన్…
కరోనా మహమ్మారి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మొదటల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే సడలింపులు ఇచ్చిన సర్కార్.. ఆ తర్వాత సడలింపుల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచింది.. కేసులు తగ్గడంతో.. ఆ వెసులు బాటను 12 గంటల ఇచ్చింది. దీంతో.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు.. ఆపై లాక్డౌన్ అమలు…
2017 లో ఆండ్రాయిడ్ వినియోగదారులను జోకర్ మాల్వేర్ ముచ్చెమటలు పట్టించింది. మనకు తెలియకుండానే యాప్‌లలో వచ్చే యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ మన మొబైల్‌లోకి ప్రవేశించి, మన ఎకౌంట్లోని డబ్బులను గుంజేస్తుంది. ఎకౌంట్ నెంబర్ నుంచి, బ్యాంక్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లను ఈ మాల్వేర్ నియంత్రిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ మాల్వేర్ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ మాల్వేర్ను గుర్తించి పూర్తిగా తొలగించడానికి మూడేళ్ల సమయం పట్టినట్టు గూగుల్ సంస్థ ప్రకటించింది. …
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1417 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 610834 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1897 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 586362 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3546 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19029 యాక్టివ్ కేసులు…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత మెరుగుపరిచేందుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కమిటీ బిఆర్కె భవన్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆస్పత్రికి సకాలంలో రాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అన్నీ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. రాష్ట్రంలో వైద్య సేవల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని కూడా సూచించింది.…
టీఆర్ఎస్లోని ఆ సీనియర్ నేతకు మళ్లీ పదవీయోగం ఉందా? ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం దక్కించుకుంటారా? ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులపై ఆయన ఫైర్ కావడం వెనక కారణం అదేనా? ఎమ్మెల్సీ పదవిపై అధిష్ఠానం హామీ దక్కిందా లేదా? కడియం శ్రీహరికి మరోసారి ఎమ్మెల్సీ ఇస్తారా? తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అయ్యాయి. షెడ్యులు ప్రకారం ఇదే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ…
తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఎంపిక చివరి దశకు చేరుకున్నది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ముందే కొత్త పీసీసీని నియమించాల్సి ఉన్నా, ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందని వాయిదా వేశారు. కాగా, ఈరోజు ఢిల్లీలో తెలంగాణ పీసీసీ నియామకంపై సోనియాగాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ హాజరయ్యారు. ఏ క్షణమైనా టీపీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నది. టీపీసీసీ రేస్‌లో ఉన్న రేవంత్ రెడ్డి…
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ నియామక ప్రక్రియపై పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పదవి నాకు కావాలి.. అంటే నాకు అంటూ పోటీ పడుతున్నారు నేతలు. పదవి కోసం పోటీ పడటం సహజమే. అయితే, నాకు పదవి వచ్చినా రాకపోయినా… పక్కోడికి మాత్రం రావొద్దు అనే తరహా ఫిర్యాదులు చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై కీలక భేటీ నిర్వహించనుంది కాంగ్రెస్ అధిష్టానం. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరుగనుంది.…