వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం.. మూడు సిద్ధాంతాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించింది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హైదరాబాద్ రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. విధి విధానాలు ప్రకటించారు. అక్కడే ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే తాను పార్టీ పెట్టినట్లు చెప్పారు. సమానత్వం, స్వయం సమృద్ధి, సంక్షేమమే.. తమ పార్టీ సిద్ధంతామన్నారు షర్మిల. రాష్ట్రంలో ఇవాళ్టికి కూడా పేదరికం పోలేదని… పేదరికం నుంచి కేసీఆర్ కుటుంబం మాత్రమే బయటపడిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.
జల వివాదంలో ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు షర్మిల. రెండేళ్ల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే ఇప్పుడే సీఎం కేసీఆర్ మేల్లొన్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్నాయంటున్న బీజేపీ.. ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు షర్మిల. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండూ తోడుదొంగలే అన్న ఆమె.. కాంగ్రెస్‌కు వైఎస్‌ఆర్ పేరును ఉచ్చరించే అర్హత లేదన్నారు.సరిగ్గా వందరోజుల్లో రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెడతానని ప్రకటించారు.
Also Read
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
తాజావార్తలు
-
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
-
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
-
Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
-
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
-
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!