హైదరాబాదీలకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటుగా వ్యాక్సినేషన్‌ను వేగంగా వేస్తున్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. సోమవారం నుంచి తిరిగి రాష్ట్రంలో పరిస్థితులు సాధారణంగా మారబోతున్నాయి. Read: 100 శాతం బంగారు తెలంగాణ చేసి తీరుతాం : సిఎం కెసిఆర్ ఈ నేపథ్యంలో నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్టు కేంద్ర హోంశాఖ…
ఆయన ఫోన్ మోగిందంటే కాంగ్రెస్ నాయకులకు హడల్. గడిచిన కొన్ని రోజులుగా ఆయన వేట మామూలుగా లేదట. డైలీ ఏదో ఒక బాంబు పేల్చుతూనే ఉన్నారు. దీంతో మహాప్రభో.. ఏంటీ వాయింపు? అని తల పట్టుకుంటున్నారట పార్టీ నేతలు. ఇంతకీ ఎవరా లీడర్? ఎదురుపడితే బ్యాండ్ బాజానే! వి. హన్మంతరావు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన ఫోన్ చేస్తే భయపడుతూనే కాల్ రిసీవ్ చేసుకుంటారు నాయకులు. ఒకవేళ ఫోన్ ఆన్సర్ చేయకపోతే.. రేపటి రోజున ఆయనకు…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సిద్దిపేట, కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం సిద్దిపేటకు వెళ్లిన ముఖ్యమంత్రి కలెక్టరేట్, సీపీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ప్రసంగించారు. సిద్దిపేట తాను పుట్టిన జిల్లా అని తెలిపారు. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీని మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సిద్దిపేటతో పాటుగా వరంగల్, నల్గొండ, నిజామాబాద్ లకు వెటర్నరీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో మంచినీళ్లకు ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం చెరువులన్నీ నిండి ఉన్నాయని, మే నెలలో కూడా…
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ను ప్రారంభించనున్నారు. ఆతర్వాత సిద్దిపేట పట్టణ శివారులో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి హరీష్ రావు..…
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఆంద్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ కేబినెట్ కు తెలిపింది. ఎన్ జీ టీ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని, కేబినెట్ తీవ్రంగా ఖంఢించింది.…
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చింది.. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్టు కేబినెట్ పేర్కొంది. అలాగే కొత్తపేట లో ప్రస్థుతం వున్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్…
భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటెల రాజేందర్.. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి చివరకు ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ పెద్దలను కలిసి తన అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.. ఆ తర్వాత టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పడం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. మళ్లీ విమానంఎక్కి హస్తినకు వెళ్లి కాషాయ కండువా కప్పుకోవడం జరిగిపోయాయి.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన నియోజకవర్గం హుజూరాబాద్‌పై ఫోకస్ పెట్టిన ఆయన.. తన వెంటన వచ్చిన టీఆర్ఎస్…
ఆ టీఆర్ఎస్ ఎంపీ కొన్నాళ్లుగా యాక్టివ్‌గా లేరు. మరోవైపు చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వెనక కారణాలేవైనా.. పార్టీ మారడం లేదని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకా ప్రకటన చేశారు? తెరవెనక ఏం జరిగింది? ఎవరా ఎంపీ? రెండోసారి ఎంపీ అయ్యాక లోకల్‌గా ఇబ్బందులు!బీజేపీలోకి వెళ్తారని ప్రచారం! 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తొమ్మిది ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి రెండోసారి లోక్‌సభ సభ్యుడయ్యారు బీబీ పాటిల్. నాటి…
ఇరు వర్గాల మధ్య భూమి విషయంలో జరిగిన గొడవ.. ముగ్గురు హత్యలకు దారి తీసింది.. తెలంగాణలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో రెండు వర్గాల మధ్య పత్తి చేన్ల వద్ద వివాదం మొదలైంది.. మాటలు, వాగ్వాదం, తోపులాటతో.. చివరకు గొడ్డళ్లతో దాడి చేసేవరకు వెళ్లింది.. ఓ వర్గం గొడ్డళ్ల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తంద్రి, ఇద్దరు కుమారులు అక్కడికక్కడే మృతిచెందారు.. ముగ్గురుని హత్య…