హుజూరాబాద్ ప్రజలంతా ఈటల రాజేందర్‌కు గోడి కట్టేందుకు సిద్ధమయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్.. హుజురాబాద్‌లో పెద్ద ఎత్తున యువత టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని తెలిపారు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేశామని వెల్లడించారు.. అయితే, వాపును చూసి ఈటల బలుపుగా భావిస్తున్నారంటూ సెటైర్లు వేశారు గంగుల… రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గోరి ఎందుకు ఎట్టాలో ఈటల చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. రైతు బంధుకు చెక్ తీసుకుని…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాకముందే.. మరోవైపు థర్డ్ వే భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. అయితే, థర్డ్ వేవ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. అనవసరంగా ప్రజలను భయపెట్టకూడదని సూచించారు.. ఇవాళ హైదరాబాద్‌లోని దుర్గా భాయ్ దేశముఖ్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రపంచాన్నిపట్టి పీడిస్తోందన్నారు.. యూరప్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్‌ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు…
లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకుల నుంచి 300 కోట్ల రూపాయలు కొట్టేయాలని ప్లాన్ చేసారు.టైల్ బేసిక్ లో కలకత్తా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కోటి 18 లక్షల రూపాయలు డ్రా చేసారు నిర్వాహకులు. లోన్ యాప్ ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. హైదరాబాద్ చెందిన అనిల్ నల్లమోతు ద్వారా డబ్బులను డిపి చేసారు చైనా కేటుగాళ్లు. సైబర్ క్రైమ్ పోలీసులు పేరుతో బ్యాంకులను బెదిరించిన అనిల్…
తాజాగా టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి కాస్త వెనుకో ముందు ఉప ఎన్నికలు జరగనుండడంతో.. నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి.. ఇంటికి వెళ్లి అందరినీ కలవాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇదే సమయంలో.. మరికొంతమంది నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. పనిలో పనిగా.. టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ లోక్ సభ…
మేడిగడ్డ బ్యారేజ్ 15 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు మహారాష్ట్ర అధికారులు.. దీంతో.. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీకి దాదాపు 53 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి చేరుతోంది.. దీంతో ఈ రోజు ఉదయం బ్యారేజీ 15 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. 15 గేట్ల ద్వారా 31,100…
పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పెట్రో ధరలకు బ్రేక్ పడింది.. ఇక, ఆ తర్వాత మే 4వ తేదీ నుంచి వరుసగా పెరుగుతూ పోతున్నాయి చమురు ధరలు.. ఇప్పటి వరకు 27 సార్లు వడ్డించాయి చమురు కంపెనీలు.. ఇక, ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను మరింత పెంచారు.. లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, లీటర్ డీజిల్‌పై 30 పైసల చొప్పున పెంచాయి ఆయిల్ సంస్థలు.. తాజా వడ్డింపుతో కలిపి హైదరాబాద్‌లో…
కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు అండగా ఉంటూ రైతు బంధు పథకం కింద పంట సాయాన్ని అందిస్తోంది.. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తోంది సర్కార్.. ఇప్పటి వరకు 42.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదును జమ చేశామని.. మూడు రోజుల్లో రైతుబంధు కింద రూ. 1153.50 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు అధికారులు.. ఇక, నాలుగో రోజులో భాగంగా రేపు…