తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల తగ్గుముఖం, లాక్డౌన్ ఎత్తివేతతో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. శనివారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలు ప్రారంభం అయినప్పటి నుంచి విద్యార్థులు, సిబ్బంది కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ పలు సూచనలు చేసింది. కాగా తెలంగాణలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని కాసేపటి…
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం.. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చింది.. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్టు కేబినెట్ పేర్కొంది.. అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తివేసింది.. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని.. వైద్యారోగ్యశాఖ నివేదిక పరిశీలించిన…
ఆయనో మంత్రి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా సొంత పార్టీవర్గాలే చెవులు కొరుక్కుంటాయి. ఏదో ఒక అంశంలో మంత్రి పేరు వినిపించడం కామన్. ఈసారి తమ్ముడు చేసిన పనివల్ల చిక్కుల్లో పడ్డారు. విపక్షాలకు మళ్లీ దొరికిపోయారు. దాంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారట అమాత్యుల వారు. మళ్లీ చర్చల్లోకి వచ్చిన మంత్రి మల్లారెడ్డి మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ పేరు చెప్పగానే రాజకీయవర్గాల్లో అనుకోకుండానే నవ్వు వచ్చేస్తుంది. ఆయన కామెడీ టైమింగ్ అలా ఉంటుంది మరి.…
పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. 70 శాతం వరకు పన్నుల రూపంలో దోచుకుంటున్నారు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.కేంద్ర ప్రభుత్వ ముందు చూపు లేకపోవడంవల్లనే కరోనాను అరికట్టడంలో విఫలమయ్యారు. పీఎం కేర్ పేరుతో వేల కోట్లు వసూలు చేస్తున్నారు అని తెలిపారు. ముందుచూపు లేకపోవడం వల్లనే వ్యాక్సిన్ అందరికి వేయలేక పోయారు. సొంతంగా భారత దేశంలో వ్యాక్సిన్ తయారు అవుతున్నా. ఇక్కడి…
కరోనా మహమ్మారి విజృంభణ.. మరోవైపు లాక్డౌన్లతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. ఇక, దూర ప్రాంతాలకు వెళ్లే వారి పరిస్థితి దారుణంగా తయారైపోయింది. రెగ్యులర్ సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన పరిస్థితి లేదు.. ఇక, ఇదే సమయంలో.. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.. ఈ నెల 21 తేదీ నుంచి జులై 1వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే.. ఈ నెల 21వ…
విజన్ ఉన్న నేత రాహుల్ గాంధీ.. దేశం కోసం ఆయన ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని కోరారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. గాంధీభవన్‌లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వ్యవస్థలను మోడీ సర్కార్ కూల్చి వేస్తోందని మండిపడ్డారు.. మాటలతో బతికే ప్రధాని మోడీ అని దుయ్యబట్టిన ఆయన.. యువత ఉద్యోగాలు లేక నిరాశతో ఉందన్నారు.. ఆస్తులు అన్నీ అమ్మకానికి…
ప్రజల క్షేమం విషయంలో అందరికంటే ముందు వరుసలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముందుగానే సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే గ్రహించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. రైతు మల్లారెడ్డి మనస్థాపానికి ఎందుకు గురయ్యారు. దానికి కెసిఆర్ తీసుకొస్తున్న ఇరీగేషన్ ప్రాజెక్ట్స్ కారణం అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు న్యాయస్థానికి వెళ్లకుండా ప్రొజెక్ట్స్ నిర్మించిన ఘనత కాంగ్రెస్…
కంటికి కనిపించని మాయదారి కరోనా మహమ్మారి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తోందో తెలియని పరిస్థితి.. అందుకే భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, శానిటైజర్లు వాడాలని, గుంపులుగా ఉండొద్దని ఎంత ప్రచారం చేసినా.. కొందరు పెడచెవిన పెడుతూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే కాలానికి చెందిన 35 మంది యువకులు కోవిడ్ బారినపడ్డారు.. తీరా ఆరా తీస్తే.. వాళ్లు అంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ అడినట్టు చెబుతున్నారు..…
కరోనా బారినపడి కొంతమంది మావోయిస్టులు మృతిచెందినట్టు ప్రచారం జరుగూతేఉంది.. అయితే.. కరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం.. కేవలం పోలీసుల సృష్టి మాత్రమే అంటున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ… ఇక, కరోనా సెకండ్ వేవ్ ప్రబలడానికి దేశ పాలకులే కారణం అని ఆరోపించారు ఆ పార్టీ అధికార ప్రధినిధి అభయ్.. కరోనా మహమ్మారితో మావోయిస్టుల మృతి అంటూ పోలీసులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ నిరభ్యంతరంగా, మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండిస్తుందంటూ ఓ ప్రకటన…
బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వరంగల్ మీడియాతో మాట్లాడిన ఆయన… ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారని వెల్లడించారు.. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరుగుతుందని.. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారని.. ఆ తర్వాత కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న బోజనం…