ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు అవమానం జరిగింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసు హెడ్ క్వాటర్స్ దగ్గర పోలీసులు నిలిపివేశారు. వాహనం దిగి ఆర్ అండ్ బి అతిథిగృహం వరకు నడిచివెళ్లిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి… పోలీసులు తీరుకు నడిచివెళ్లి నిరసన తెలిపారు. అటు అధికార పార్టీ ఎమ్మెల్యేపై పోలీసుల వైఖరిని తప్పుపడుతున్నారు నేతలు. ఇది ఇలా ఉండగా.. సీఎం రాక సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరపత్రాలు…
తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్ర లో చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం లో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ,…
అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు నిన్న టీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేత ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని, ఇవాళ్టి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గమ్య స్థానములకు TSRTC బస్సులను నడుపనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటు వంటి లాకడౌన్ నిబంధనలు అనుసరించి, ప్రతి రోజూ ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 6 గంటల లోపున ఈ సర్వీసులు రద్దీకీ అనుగుణంగా నడుపనుంది తెలంగాణ ఆర్టీసీ. అటు…
జూన్ 19 వ తేదీతో లాక్డౌన్ ముగియడంతో 20 వ తేదీనుంచి ఎలాంటి పొడిగింపు లేకుండా లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తివేశారు. ఆదివారం నుంచి లాక్డౌన్ ఎత్తివేయడంతో నగరంలోని ప్రజలు రోడ్డుమీదకు వచ్చారు. దాదాపు నెల రోజులుగా ఇంటికే పరిమితమైన ప్రజలు, లాక్డౌన్ ఎత్తివేయడంతో నగరంలోని ప్రముఖ ప్రదేశాలను కుంటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు ఆసక్తి చూపించారు. నక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినిపార్క్, గోల్కొండ కోట ప్రజలతో కిటకిటలాడింది. ఇక చార్మినార్‌లో మరింత సందడి వాతావరణం…
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి మంత్రి హరీష్ రావు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హరీష్ రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డువచ్చాయి. దీంతో ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో ఢీకొంటింది హరీష్ రావు పైలెట్ కారు. ఆ వెంటనే.. పైలెట్ కారును మంత్రి హరీష్ రావు వాహనం ఢీకొంటింది. ఈ ప్రమాదంలో ముందు కారులోని వ్యక్తికి…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1006 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 613202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1798 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,91,870 మంది డిశ్చార్జ్ అయ్యారు. read more : చిత్తూరు మేయర్ అముదపై వైసీపీ శ్రేణుల్లో చర్చ ! ఇప్పటివరకు…
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు టీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేత ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని,…
బీజేపీ నేత విజయశాంతి మరోసారి సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ఎలా ఎత్తేస్తారని ఆమె ప్రశ్నించారు. ” తెలంగాణ ప్రజలంటే శుద్ధ అమాయకులని, ఇట్టే మోసం చెయ్యవచ్చనేది సీఎం కేసీఆర్ గారి గట్టి విశ్వాసం. నిన్నటి వరకూ కరోనా పేరిట పగలు కొన్ని గంటల పాటు, రాత్రి మొత్తం లాక్డౌన్ పెట్టి… చివరికి పాజిటివ్ రేటు తగ్గిపోయిందంటూ కరోనా కట్టడికి ఎలాంటి చర్యలూ ప్రకటించకుండానే ఉన్నట్టుండి లాక్డౌన్ పూర్తిగా ఎత్తేశారు.…
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైందా? ఏళ్ల తరబడి ఒకే ప్లేస్‌లో పనిచేస్తున్న వారికి రిలీఫ్ లభిస్తుందా? ఎస్ఐ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ఎదురు చూస్తున్న శుభ ఘడియ రానే వచ్చిందా? పోలీస్ శాఖలో జరుగుతున్న చర్చ ఏంటి? ఐదారేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఐపీఎస్‌లు! తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీ అనే మాట విని చాన్నాళ్లు అయింది. ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్ అన్నట్టు.. కుర్చీలకు అతుక్కుపోయి పనిచేస్తున్నారు అధికారులు. డిపార్ట్మెంట్లో ఎస్ఐలదే…