మాజీ మంత్రి ఎల్.రమణ శుక్రవారం తెలంగాణ తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా రమణ ప్రకటించారు. దీంతో టీ-టీడీపీ నూతన అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. కాగా నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీ పార్టీ తెలంగాణ శాఖకు చెందిన కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జీలతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు.. టీటీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందన్న కోణంలో చర్చిస్తున్నారు. కాగా, టీ-టీడీపీ అధ్యక్ష పదవికి కొత్తకోట దయాకర్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నర్సింహులు, నన్నూరి నర్సిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.