అక్రమార్కులపై యాక్షన్ తీసుకోకుండా నేతలు ఒత్తిళ్లు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమార్కుల భరతం పడతామని కొరడా బయటకు తీశారు. దూకుడుగా వెళ్లారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో ఉలుకు లేదు పలుకు లేదు. ఎక్కడివారు అక్కడే గప్‌చుప్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోన్న ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.
నాడు గంభీరమైన ప్రకటనలు.. నేడు పత్తా లేరు!
Also Read
తప్పు చేస్తే తాట తీస్తాం. ఎంతటి వారైనా వదిలేదు లేదు. కటకటాల వెనక్కి నెట్టడం ఖాయం. కరోనా సమయంలో నిజమాబాద్ జిల్లా ఉన్నతాధికారులు గంభీరంగా పలికిన పలుకులివి. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న ప్రధాన ప్రభుత్వ శాఖల ఆఫీసర్లు ఓ రేంజ్‌లో ఈ డైలాగ్‌లు పేల్చారు. వారికి ప్రజాప్రతినిధులు కూడా కోరస్ ఇవ్వడంతో అక్రమార్కుల పనైపోయిందని అంతా భావించారు. కానీ.. షరా మామూలే. నాడు ఎన్నో చెప్పిన అధికారులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. అప్పుడలా అన్నారుగా అని ఎవరైనా గుర్తు చేస్తే.. ముఖం తిప్పుకొని వెళ్లిపోతున్నారు.
కరోనా టైమ్‌లో అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రులపై చర్యల్లేవ్?
కరోనా సెకండ్ వేవ్‌లో నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చాయి. భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు బాధితులు. అలా ఫిర్యాదులు అందుకున్న అధికారులు.. ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేశారు. కొందరికి నోటీసులు ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిని సీజ్ చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు ఎంతో గొప్పగా చెప్పారు అధికారులు. రోజులు గడిచిపోయాయి కానీ.. ఒక్క ఆస్పత్రిపైనా చర్చల్లేవ్. నోటీసులు ఇచ్చేసి మమ అనిపించారు. ఇదే విషయాన్ని ఆ మధ్య జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్య అధికారులను ప్రశ్నించినా.. నీళ్లు నమిలారు తప్ప సమాధానం లేదు.
లక్కీ డ్రా నిర్వాహకులపై అధికారులు శీతకన్ను!
ఆ మధ్య లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్న తీరుపై గగ్గోలు రేగింది. బాధితుల్లో కొందరు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. కొత్తలో లక్కీ డ్రా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు తర్వాత పత్తా లేకుండా పోయారు. ఆయా లక్కీ డ్రా నిర్వాహకుల నుంచి మామూళ్లు అందడం వల్లే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ లక్కీ డ్రా సంస్థ అయితే ఓ పోలీస్ ఉన్నతాధికారి సాయంతో రాజీకి ప్రయత్నిస్తోందట.
చర్యలు తీసుకోకుండా అధికారులపై ఒత్తిళ్లు?
కొన్ని ప్రైవేట్ స్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యాశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు కూడా. కానీ.. ప్రకటనలతోనే సరిపెట్టేశారు. చర్యలు లేవు. అధికారులు ఈ విధంగా గంభీరంగా ప్రకటనలు చేయడం.. తర్వాత వెనక్కి తగ్గడం వెనక జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నట్టు చెబుతున్నారు. బయట ఏవేవో చెబుతాం.. అన్నీ చేస్తామా ఏంటి? కొన్నాళ్లు పోతే జనాలే మర్చిపోతారు.. ప్రస్తుతానికి మీరూ మర్చిపోవాలని అధికారులను కోరుతున్నారట. అందుకే ఆఫీసర్లు ఎక్కడివారు అక్క గప్‌చుప్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
ఒత్తిళ్లా.. నేతల పేరు చెప్పి క్యాష్ చేసుకుంటున్నారా?
ఆయా కీలక శాఖలకు చెందిన అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్న ప్రజాప్రతినిధులు ఎవరు? లేక నేతల పేరు చెప్పి ఇంకేవరైనా అధికారులు కేసుల్ని క్యాష్ చేసుకుంటున్నారా అన్న అనుమానాలు లేకపోలేదు. దాల్ మే కుచ్ కాలాహై అన్న చర్చ అయితే సాగుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!