కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. టీకాల కొరతతో కొంతకాలం తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేయాల్సి వచ్చినా.. ఇప్పుడు ది బెస్ట్ అనిపించుకుంటుంది.. ఎందుకంటే వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం పెట్టుకున్న టార్గెట్‌ను రీచ్ అయ్యింది.. ఇప్పటికే 80 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.. అంటే 80 శాతం ప్రజలకు ఫస్ట్ డోస్ వేశారు.. ఇక, సెప్టెంబర్ నెలాఖరునాటికి వందశాతం మందికి ఫస్ట్ డోస్ వేయడమే టార్గెట్‌గా పెట్టుకుని ముందుకు కదులుతున్నారు. మొత్తం 2.20 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని టార్గెట్‌గా పెట్టుకోగా.. 1.74 కోట్ల మందికి దాదాపు 80 శాతం మందికి తొలి డోసు అందించారు.. దేశంలో అతి కొద్ది రాష్ట్రాల్లోనే 80 శాతం తొలిడోసును పూర్తి చేశారు. మరోవైపు రాష్ట్రంలో సెకండ్ డోస్ ఇప్పటి వరకు 20 శాతం మందికి పూర్తిచేసినట్టు అధికారులు చెబుతున్నారు.
జీహెచ్‌ఎంసీలో సెప్టెంబర్ 9నాటికి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోన్న సర్కార్.. దాని కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది.. అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.. ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుండటంతో ప్రైవేటులో తక్కువగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటి వద్దకే వచ్చి వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం కూడా నడుస్తోంది.. మహానగరంలో వ్యాక్సినేషన్ పూర్తి అయితే.. ఇతర ప్రధాన పట్టణాల్లోనూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు.