హైదరాబాద్లో టూ లెట్ బోర్డు పెట్టినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జరిమానా విధిస్తుందంటూ ఓ వార్త హల్ చల్ చేసింది.. ఈవీడీఎం కింద సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాల్లోని అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, వాల్ రైటింగ్ తదితరాలపై అధికారులు జరిమానా విధించడంతో ఓ ప్రచారం మొదలైంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది జీహెచ్ఎంసీ.. సొంత ఇంటికి టూ లెట్ బోర్డు పెట్టినా ఫైన్ అని వచ్చిన వార్తలను ఖండించింది..…
ఇది పాదయాత్రల సీజన్. తెలంగాణలో మరో పాదయాత్రకు ముహూర్తం కుదిరింది. ఇందిరా శోభన్ తాజాగా ఈ లిస్టులో చేరిపోయారు. ఇటీవలషర్మిల పార్టీకి గుడ్బై చెప్పిన ఆమె మీడియా ముందుకు వచ్చారు. తన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో వివరించారు. ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటమే ఆమె టార్గెట్. టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానలపైనే తన పోరాటమంటున్నారు ఇందిరా శోభన్. ఆమె తలపెట్టిన పాదయాత్ర పేరు ఉపాధి భరోసా…
సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ను బదిలీ చేసింది ప్రభుత్వం… వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు.. ఆయన వరంగల్ సీపీగా ఉన్న సమయంలో యాసిడ్ దాడి చేసిన కేసులో నిందితుల ఎన్కౌంటర్, ఆ తర్వాత సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్లో సజ్జనార్ పేరు మారుమోగింది.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా సేవలు అందిస్తున్న సజ్జనార్.. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో కలిసి.. కరోనా,…
70:30 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపకం జరగాలని కేఆర్ఎంబీకి ఏపీ లేఖ రాసింది. కృష్ణా జల వివాదాల రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 నీటి సంవత్సరానికి ఏపీకి 70 శాతం.. తెలంగాణకు 30 శాతం మేర నీటి పంపకం చేయాలని కేఆర్ఎంబీకి ఏపీ సూచించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేసింది ఏపీ. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి…
మొన్నటి వరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు రావడం లేదని చర్చ జరిగింది. ఇప్పుడేమో వస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదట. వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ గుర్తించినా.. ముందు వరసలో తళుక్కుమంటున్నా.. ఆయన ఒకరు ఉన్నారన్న సంగతే ఎవరికీ తెలియడం లేదట. చిర్రెత్తుకొచ్చిన ఆ నాయకుడు పార్టీ ఇంఛార్జ్కి ఫోన్ చేసి ఓ రేంజ్లో అందుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా గొడవ? పార్టీ నేతలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు! తెలంగాణ కాంగ్రెస్లో ఎవరి స్టైల్…
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు నకిలీ ఈడి నోటీసులు పంపారు. తనను అరెస్ట్ చేస్తామంటూ ఈడి పేరుతో నకిలీ నోటీసులు పంపారు ఆగంతకులు. దాంతో ఈడి అధికారులని సంప్రదించారు మంత్రి గంగుల కమలాకర్. నకిలీ నోటీసుల పై సైబర్ క్రైమ్ పోలీసులుకు ఈడి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై 420,468,,471 కింద కేసు నమోదు చేసారు పోలీసులు. దర్యాప్తు లో భాగంగా మంత్రి గంగులకు పోలీసులు ఫోన్ చేయగా నకిలీ నోటీసులు పై ఫిర్యాదు…
ఈరోజు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నెల 4,5,6,9,10 తేదీల్లో జరిగాయి ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్షలు. ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) ఎంట్రెన్స్ కి 90 శాతం హాజరు అయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి లక్షా 64 వేల 964 మంది దరఖాస్తు చేసుకుంటే లక్ష 47 వేల 986 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఎంసెట్ అగ్రికల్చర్ ,మెడికల్ స్ట్రీమ్ కి 91.19 శాతం ఉపస్థితి…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 389 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు.. ఇక, 420 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,55,732 కు చేరగా.. రికవరీ కేసులు 6,45,594 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… సెప్టెంబర్ మొదటి వారంలో గ్రామ కమిటీలు, రెండోవారం లో మండల కమిటీలు, మూడో వారం లో జిల్లా కమిటీలు.. అలాగే అక్టోబర్ లో రాష్ట్ర కమిటీ లు పూర్తిచేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. దళిత బందు పై ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలని కేసీఆర్ తెలిపారు. అన్ని వర్గాలకు టీఆర్ఎస్ న్యాయం చేస్తుంది. అన్ని వర్గాలకంటే దళితులు వెనుకపడ్డారు కాబట్టే మొదట వారికోసం దళిత బంధు తెచ్చాము. అన్ని వర్గాలకు న్యాయం…